Vijay Devarakonda: విజయ్‌ కొత్త పోస్ట్‌తో లేని పోని డౌట్స్‌ వచ్చేస్తున్నాయిగా!

‘నా తండ్రి తెల్వదు.. నా తాత తెల్వరు.. నేనంటే మీకెందుకు అంత ప్రేమ’ అంటూ ఆ మధ్య తన అభిమానుల్ని ఉద్దేశించి విజయ్‌ దేవరకొండ అన్నాడు గుర్తుందా? దానికి అప్పుడు పెద్ద రచ్చ కూడా జరిగింది. తన ఇంట్లోనే వారసత్వ నటుడు అయిన తన తమ్ముడు ఉండగానే వారసత్వం గురించి మాట్లాడాడు అని జోకులు కూడా పేలాయి. అయితే ఈ క్రమంలో విజయ్‌.. తను సింగిల్‌, ఎవరి సపోర్టు లేదు అని చెప్పదలుచుకున్నాడు అని కొంతమంది అన్నారు. ఇప్పుడు మరోసారి విజయ్‌ అలాంట పనే చేశాడు. మరి ఈసారి ఏమవుతోందో?

‘సైమా’ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా విజయ్‌ డాపర్‌ లుక్‌లో కనిపించాడు. సూటు, బూటుతో లుక్‌ అదిరిపోయింది. ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ‘సింగిల్‌ ప్లేయర్‌’ అని రాసుకొచ్చాడు. ఇందులో అంతగా ఆలోచించే విషయం ఏముంది అని కొట్టిపారేయలేం. ఎందుకంటే విజయ్‌ ఇప్పుడున్న మూడ్‌ అలాంటిది. ‘లైగర్‌’ సినిమా విడుదలకు ముందు, తర్వాత విజయ్‌ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. దానికి ఆయన చేష్టలు కొంచెం కారణమైతే, సినిమా ఫలితం మరో కారణం.

ఈ క్రమంలో విజయ్‌ పెట్టిన ట్యాగ్ ‘సింగిల్‌ ప్లేయర్‌’ బాగా వైరల్‌ అవుతోంది. ‘తనను పరిశ్రమలో ఒంటిరిని చేసేశారు అందుకే అలా పెట్టాడు’ అని కొంతమంద నెటిజన్లు అంటుంటే.. మరికొందరేమో ‘ఎవరు ఏమన్నా.. తను సింగిల్‌ పీస్‌ లెక్క. అందుకే అలా రాశాడు’ అని అంటున్నారు. దీంతో ఈ చర్చ ఇంకా సోషల్‌ మీడియాలో కొనసాగుతోంది. మరి విజయ్‌ ఆ ట్యాగ్‌ పెట్టాడు అనేది విజయ్‌ మాత్రమే చెప్పగలడు. లేదంటే విజయ్‌ గురించి ఏమన్నా, ఎవరన్నా ఠక్కున స్పందించే అతని టీమ్‌ కాని టీమ్‌ అయిన కొంతమంది మీడియా ప్రతినిధులు చెప్పాలి.

విజయ్‌ను ఇండస్ట్రీలో చాలామంది సపోర్టు చేశారు. అందుకే ఇన్ని సినిమాలు ఫ్లాప్‌ అవుతున్నా ‘లైగర్‌’ లాంటి అవకాశం వచ్చింది. ‘వాట్‌ లగా దేంగే’ అంటూ అందరూ అదే మాట అంటూ సపోర్టు చేశారు. అయితే సినిమాలో సత్తా లేకపోతే ఏం చేస్తాం. దానికే నన్ను అందరూ వదిలేశారు అని అనే రకం అయితే విజయ్‌ కాదు.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus