విజయ్‌ దేవరకొండ కొత్త సినిమా ఆయనతోనేనా?

జీవితంలో ఏదైనా భారీగా చేయాలనుకున్నా, వాట్‌ లగా దేంగే అంటూ.. ఆ మధ్య ఓ నెల పాటు ఊదరగొట్టిన విజయ్‌ దేవరకొండ ఇప్పుడు నేల మీదకు దిగాడు అని అంటున్నారు. ‘లైగర్‌’ సినిమా ఫలితంతో విజయ్‌ దేవరకొండ ఇప్పుడు తర్వాతి సినిమాల విషయంలో ఆవేశంతో కాకుండా, ఆలోచనతో ముందుకెళ్తున్నాడు అని అంటున్నారు. ఈ క్రమంలో భారీతనం, యాటిట్యూడ్‌ కథలు పక్కనపెట్టి ప్రేమకథలపై దృష్టి పెట్టాడు అని అంటున్నారు. అందుకే అతని ఫిల్మోగ్రఫీలో ప్రేమ తర్వాత మళ్లీ ప్రేమే వస్తుంద అని చెబుతున్నారు.

వరుసగా ఒకేలాంటి సినిమాలు వద్దనుకున్నాడో, లేక ముందే ఓకే చేసిన సినిమా కాబట్టి చేశాడో తెలియదు కానీ. ‘లైగర్‌’ తర్వాత ‘ఖుషీ’ సినిమాను ఓకే చేశాడు విజయ్‌. ఆ సినిమా షెడ్యూల్స్‌ కూడా అయ్యాయి. త్వరలో కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది అని చెబుతున్నారు కూడా. ఈ సినిమా తర్వాత ఏంటి అనే విషయంలోనూ విజయ్‌ క్లారిటీకి వచ్చేశాడట. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న దిల్‌ రాజు ప్రాజెక్ట్‌ను ఓకే చేసేశాడట. అప్పుడెప్పుడో ఓకే అయ్యి, కొన్ని కారణాల వల్ల ఆగిన ప్రాజెక్ట్‌ ఇది.

ఈ సినిమా దర్శకుడు ఎవరు అనే విషయంలోనూ క్లారిటీ వచ్చిందంటున్నారు. గతంలో దిల్‌ రాజు – విజయ్‌ సినిమాకు దర్శకుడిగా మోహనకృష్ణ ఇంద్రగంటి పేరు వినిపిచిందింది. అంతా ఓకే త్వరలోనే అనౌన్స్‌మెంట్‌ అనుకుంటుండగా ఆగిపోయింది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సినమా స్టార్ట్‌ చేయాలని చూస్తున్నారట. కొంతమంది దర్శకుల పేర్లు ఇటీవల వినిపించినా.. మోహనకృష్ణ ఇంద్రగంటికే విజయ్‌, దిల్ రాజు ఓటేశారట.

రొమాంటిక్, ల‌వ్, ఎంట‌ర్‌టైన‌ర్‌ సినిమాలకు మోహనకృష్ణ ఇంద్ర‌గంటి అందె వేసిన చేయి. దానికి తోడు త‌క్కువ సమయంలో సినిమాను పూర్తి చేస్తారనే పేరూ ఉంది. దీంతో ‘ఖుషీ’ సినిమా అయిపోగానే ఈ సినిమా మొదలుపెట్టేద్దాం అని అనుకుంటున్నాడట విజయ్‌ దేవరకొండ. ఇంద్ర‌గంటి ప్ర‌స్తుతం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉన్నారు. ఆ పనులు అయ్యాక ఈ సినిమా పనులు మొదలట. ‘ఖుషీ’ సినిమా ప్రేమకథ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి విజయ్‌కి ప్రేమ తర్వాత ప్రేమ వస్తోంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus