తెలంగాణ రాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకులు హనుమంతరావుగారు గత కొన్ని రోజులుగా “అర్జున్ రెడ్డి” సినిమా పోస్టర్లు తీసేయాలి, సినిమాని ఆపేయాలి అంటూ చేస్తున్న హల్ చల్ గురించి తెలియనివారుండరు. ఆయన మాటల్ని సీరియస్ గా తీసుకొని సినిమాని చూడకుండా ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ.. ఈయన చేసిన హంగామా పుణ్యమా అని సినిమా అంటే తెలీని వారికి కూడా “అర్జున్ రెడ్డి” చేరువయ్యాడు. హనుమంతరావుగారు “అర్జున్ రెడ్డి ముద్దు పోస్టర్లు” చించేస్తున్నట్లుగా ఉన్న ఒక ఫోటో పెట్టి హీరో విజయ్ దేవరకొండ “తాతయ్య చిల్” అంటూ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. అయితే.. నిన్న ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ “అర్జున్ రెడ్డి” చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలి, అసలు కేటీయార్ ఇలాంటి సినిమాఈ సపోర్ట్ చేయడమేంటి, హీరో అతనికి బంధువా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. ఈ విషయంపై కాస్త ధీర్ఘంగా స్పందించాడు మన అర్జున్ రెడ్డి అలియాస్ విజయ్ దేవరకొండ ఒక లేఖను కూడా రాశాడు.
ప్రియమైన తాతయ్య
నీ అద్భుతమైన ఆలోచనాధోరణిలో నుండి పుట్టిన లాజిక్ వల్ల “అర్జున్ రెడ్డి” చిత్రాన్ని ప్రశంసించిన కేటీయార్ నాకు బంధువైతే.. ఆ లెక్కన రాజమౌళిగారి నాకు తండ్రి, యువ కథానాయకులు రాణా దగ్గుబాటి, నాని, శర్వానంద్, వరుణ్ తేజ్ లు నా అన్నయ్య-తమ్ముళ్ళు, నాకేలాగో చెల్లి అనే అనుబంధం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి.. సమంత, అను ఎమ్మాన్యూల్, మెఃరీన్ లు నా మరదళ్లు. ఇక గత అయిదు రోజులుగా 5 వేలకు పైగా హౌస్ ఫుల్ షోస్ లో సినిమాలు చూసిన ప్రేక్షకులు, స్టూడెంట్స్, మగాళ్లు, ఆడవాళ్ళందరూ నా ట్విన్స్. ఇక ఆర్జీవి గారు మన ఇద్దరిలో ఎవరికి తండ్రో ఇంకా క్లారిటీ లేదు. మేం కష్టపడి తెలుగు సినిమాని, తెలుగు ప్రేక్షకుల మైండ్ సెట్స్ ను మార్చి ముందు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే.. కొందరు మాత్రం తొడగొట్టడం దగ్గరే ఆగిపోయారు, #తాతయ్యచిల్.
ఇట్లు మీ ప్రియమైన విజయ్ దేవరకొండ
మరి విజయ్ బాబు ఇంత వినయంతో రాసిన ఈ ప్రేమలేఖను హనుమంతరావు గారు చదివి ఎలా స్పందిస్తారో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.