Vijay,Sai Pallavi: అప్పుడు మిస్ అయ్యింది.. ఇప్పుడు ఫిక్స్ అవుతుందా?

‘టాక్సీ వాలా’ (Taxiwaala) తర్వాత విజయ్ దేవరకొండకి (Vijay Deverakonda) హిట్ పడలేదు. ‘ఖుషి’ (Khushi) కూడా యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సంగతి తెలిసిందే. సో ఇప్పుడు అతనికి అర్జెంట్ గా ఓ హిట్టు కావాలి. దీని కోసం గట్టి కసరత్తులే చేస్తున్నాడు ఈ రౌడీ హీరో. కొంచెం రూటు మార్చి వినూత్నమైన కథలు చేయడానికి రెడీ అయ్యాడు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో చేస్తున్న మూవీ అలాంటి వైవిధ్యమైన కాన్సెప్ట్ తో చేస్తున్న మూవీనే..!

అది విజయ్ దేవరకొండ కెరీర్లోనే భారీ బడ్జెట్ సినిమా అవుతుంది అని ఇన్సైడ్ టాక్. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోపక్క దిల్ రాజు (Dil Raju) బ్యానర్లో ఇంకో సినిమా చేయడానికి కూడా విజయ్ దేవరకొండ రెడీ అయ్యారు. ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Ranigaaru) తో డీసెంట్ సక్సెస్ అందుకున్న రవికిరణ్ కోలా (Ravi Kiran Kola) దర్శకత్వంలో ఓ రూరల్ యాక్షన్ డ్రామా చేయడానికి విజయ్ దేవరకొండ రెడీ అయ్యాడు.

ఇటీవల ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చింది. ఇందులో హీరోయిన్ గా సాయి పల్లవిని (Sai Pallavi) ఎంపిక చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. గతంలో ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) మూవీలో సాయి పల్లవి.. విజయ్ కి జోడీగా చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయని ఆమె నో చెప్పినట్లు టాక్ నడిచింది. దీంతో రష్మికతో (Rashmika) ఆ ప్రాజెక్టు ఫినిష్ చేశారు మేకర్స్.

అయితే అప్పుడు మిస్ అయిన పెయిర్ ఇప్పుడు ఫిక్స్ అయ్యేలా కనిపిస్తుంది. దిల్ రాజు అయితే సాయి పల్లవి డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ‘ఫిదా’ (Fidaa) ‘ఎం.సి.ఎ’ (MCA) వంటి హిట్ సినిమాల్లో సాయి పల్లవి నటించి మెప్పించింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus