Vijay, Samantha: హాట్ టాపిక్ గా మారిన విజయ్ దేవరకొండ-  సమంత ల మూవీ టైటిల్.!

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ.. ‘లైగర్’ ‘జన గణ మన’ లతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ 11వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత.. అతనికి జోడీగా నటిస్తోంది.టాలీవుడ్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థలలో ఒకటైన ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ పై వై రవిశంకర్, నవీన్ యేర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.ఈ మధ్యనే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది.

కశ్మీర్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ మూవీ ‘ఖుషి’ టైటిల్ ను అనుకుంటున్నట్టు ముందు నుండీ ప్రచారం జరిగింది. ఫైనల్ గా ఆ టైటిల్ నే ఫైనల్ చేశారు మేకర్స్.ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలియజేస్తూ మేకర్స్… విజయ్ దేవరకొండ, సమంత ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. విజయ్,సమంత ల పెయిర్ ఫ్రెష్ గా అనిపిస్తుంది.

వీళ్ళిద్దరూ ఆల్రెడీ ‘మహానటి’ సినిమాలో పెయిర్ గా నటించినప్పటికీ…ఆ మూవీలో వీళ్ళ రొమాంటిక్ ట్రాక్ ను జనాలు పెద్దగా పట్టించుకోలేదు. ‘ఖుషి’ లో మాత్రం వీళ్ళ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.ఈ ఏడాది డిసెంబర్ 23న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మరి ఈ మూవీ ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి..! గతంలో శివ నిర్వాణ దర్శకత్వంలో ‘మజిలీ’ అనే చిత్రం చేసింది సమంత. ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!


మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus