Vijay Devarakonda Watch Cost: విజయ్ దేవరకొండ కాస్ట్ లీ వాచ్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ఎంతంటే?

విజయ్ దేవరకొండ..ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.ముఖ్యంగా యూత్ లో అతనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ‘పెళ్ళి చూపులు’ ‘అర్జున్ రెడ్డి’ ‘గీత గోవిందం’ ‘టాక్సీ వాలా’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఇతను స్టార్ గా ఎదిగాడు. ఆ తర్వాత వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి చిత్రాలు నిరాశపరిచినా… ఈ ఏడాది వచ్చిన ‘లైగర్’ సినిమా పెద్ద డిజాస్టర్ అయినా ఇతని క్రేజ్ చెక్కుచెదరలేదు.

హిందీలో ఈ మూవీ అబౌవ్ యావరేజ్ గా నిలిచింది. అదే క్రమంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా ‘జనగణమన’ అనౌన్స్ చేసినా అది మధ్యలోనే ఆగిపోయింది. మరోపక్క ఇతను నటిస్తున్న ‘ఖుషి’ అనే ప్రేమ కథా చిత్రం షూటింగ్ కూడా హోల్డ్ లో పడింది. ఎందుకంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత ఆరోగ్యం అంతగా బాలేదు. డిసెంబర్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు ముందుగా ప్రకటించారు కానీ..

ఇప్పుడు అది మరోసారి వాయిదా పడటం గ్యారెంటీ అనిపిస్తుంది. శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు కాగా మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. విజయ్ దేవరకొండ యూత్ లో క్రేజ్ ను సంపాదించుకోవడానికి ఇంకో కారణం అతని డ్రెస్సింగ్ స్టైల్. అతను ధరించే డ్రెస్సులు అన్నీ స్టైలిష్ గా ఉంటాయి. ఆ డ్రెస్సుల్లో ఇతను చేసే ఫోటో షూట్లు కూడా హాట్ టాపిక్ అవుతూ ఉంటాయి.

ఇందులో భాగంగా విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో విజయ్ ధరించిన వాచ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇది ఓ కార్టియర్ వాచ్ అట. ఈ సాంటోష్ డి కార్టియర్ వాచ్ ఏకంగా రూ.30,42,935.07 లక్షలట. ఈ వాచ్ ధర తెలిసాక నెటిజన్లు షాకవుతున్నారు. మరి సినిమాకు రూ.10 కోట్లు పైగానే పారితోషికం తీసుకునే విజయ్ దేవరకొండ మెయింటెనెన్స్ మామూలుగా ఉంటుందా..!

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus