Samantha: సమంత కి విజయ్ దేవరకొండ అండ్ టీమ్ ఇచ్చిన సర్ప్రైజ్ మామూలుగా లేదు..!

స్టార్ హీరోయిన్ సమంత పుట్టినరోజు ఈరోజు. దీంతో సోషల్ మీడియాలో ఆమె పేరుతో ఉన్న హ్యాష్ ట్యాగ్ ను ఓ రేంజ్ లో ట్రెండ్ చేశారు అభిమానులు. అంతేకాకుండా ఇండస్ట్రీ నుండీ పలువురు సినీ ప్రముఖులు, సమంత సన్నిహితులు, హీరోలు ఆమెకు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మొత్తం సమంత పేరు మార్మోగింది. ఇదే క్రమంలో సమంతకి విజయ్ దేవరకొండ కూడా మర్చిపోలేని విధంగా సర్ప్రైజ్ ఇచ్చాడు.

తన నెక్స్ట్ సినిమాలో సమంత హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కశ్మీర్ లో జరుగుతోంది. షూటింగ్ లో భాగంగా విభిన్న పద్దతిలో సమంతకి బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చారు చిత్ర యూనిట్ సభ్యులు. అర్ధరాత్రి పూట ఓ సీన్ చిత్రీకరిస్తున్నట్టు టీమ్ అంతా రెడీ అయ్యారు. సమంత కూడా నిజంగానే షూటింగ్ జరుగుతోంది అనుకుంది పాపం.

కెమెరా రోల్ అవుతూ హీరో హీరోయిన్లు సీన్ చేస్తూ డైలాగ్స్ చెబుతుండగా మధ్యలో సమంత అని విజయ్ చెప్పడంతో సమంత… విజయ్ డైలాగ్ మర్చిపోయాడు అనుకుని నవ్వుకుంది. కానీ ఒకేసారి అంతా వచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో అప్పుడు అసలు విషయం తెలుసుకుంది.. టీమ్ అంతా తన కోసం ఇలా అర్థరాత్రి ఫేక్ షూట్ ప్లాన్ చేశారని తెలుసుకున్న సమంత ఎమోషనల్ అయ్యింది. ఆనందభాష్పాలు అనుకుంట కన్నీళ్ళు కూడా వచ్చేశాయి. తరువాత వెన్నెల కిషోర్, దర్శకుడు శివ నిర్వాణ ఇతర టీమ్ మెంబర్స్ సామ్ తో కేక్ కట్ చేయించి సమంతని మరింత హ్యాపీ చేశారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus