విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా ఈ శుక్రవారం నాడు అంటే ఏప్రిల్ 5న విడుదల కాబోతోంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో ఈరోజు ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసి క్యూ అండ్ ఎ సెషన్..ని నిర్వహించారు. ఇందులో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), నిర్మాత దిల్ రాజు (Dil Raju) పాల్గొన్నారు. వీరికి రిపోర్టర్లు తమ ప్రశ్నలను బుల్లెట్లు మాదిరి వదిలారు. ఈ క్రమంలో ఓ రిపోర్టర్ ‘మొదటిసారి కుటుంబ నేపధ్యం కలిగిన సినిమా చేయడానికి కారణం ఏంటి?’ అని విజయ్ దేవరకొండని ప్రశ్నించాడు.?
ఇందుకు విజయ్ దేవరకొండ ఊహించని సమాధానం ఇచ్చాడు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. “ఇదే జోనర్లో సినిమా చేయాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. కథలు నచ్చి ఈ టైంలో ఇది చేస్తే బాగుంటుంది అనిపిస్తే.. అప్పుడు అది చేస్తా.దిల్ రాజు గారు నాకు చాలా స్క్రిప్ట్..లు పంపిస్తూ ఉండేవారు. అయితే ఒకసారి నేను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నాకు కథలు కాదు… డబ్బులు ఉంటే పంపండి, టైట్ గా ఉంది అని చెప్పాను.
అప్పుడు దిల్ రాజు గారు నాకు కొంత డబ్బు పంపారు. సాధారణంగా ఆయన ఏ హీరోకి అడ్వాన్స్ ఇవ్వరట. కానీ నేను అడిగినందుకు ఆయన కాదనకుండా ఇచ్చారు” అంటూ చెప్పుకొచ్చాడు.ఈ క్రమంలో ‘అసలు విజయ్ దేవరకొండ వంటి స్టార్లకి ఆర్ధిక ఇబ్బందులు ఏంటి?’ అని మరో రిపోర్టర్ ప్రశ్నించగా.. ” నేను ‘లైగర్’ (Liger) వరకు పారితోషికం పై ఎక్కువ శ్రద్ధ పెట్టలేదు.
ఆ టైంలో నేను తీసుకునే పారితోషికం పీనట్స్ వంటిది. కాబట్టి.. నా దగ్గర డబ్బులు అంతగా లేకపోతుండె..! నా టీంకి జీతాలు వంటివి ఇవ్వగా నాకు మిగిలేది ఏమీ ఉండేది కాదు. ‘ఖుషి’ (Kushi) నుండే నేను నా మార్కెట్ కి తగ్గ పారితోషికం తీసుకుంటున్నాను. ఇక నుండి మార్కెట్ కి తగ్గ పారితోషికం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.