దేశంలో అందరికీ వాక్ స్వాతంత్ర్యపు హక్క ఉంది. ఆ హక్కును సోషల్ మీడియాలో కూడా వాడుకోవచ్చు. ఎవరైనా మన గురించి తప్పుగా మాట్లాడితే… దానికి సమాధానం చెప్పొచ్చు, అవసరమైతే వారిని సంజాయిషీ అడగొచ్చు. ఇంకా కావాలంటే క్షమాపణలు కూడా చెప్పమనొచ్చు. అయితే తప్పు మాట్లాడిన, రాసినవాళ్లను తిట్టే అధికారం ఉంటుందా? అంటే లేదనే చెప్పాలి. దీనిపై అధికారిక రూల్స్, చట్టాలు లేవు కానీ. అది కనీస ఆలోచన. అయితే దీనికి విజయ్ దేవరకొండ తుంగలో తొక్కారా? అవుననే అంటున్నారు నెటిజన్లు.
విజయ్ దేవరకొండతో ఓ హీరోయిన్ పెళ్లి అంటూ ఆ మధ్య కొన్నేళ్ల క్రితం వార్తలు షికారు చేశాయి. ఆ హీరోయిన్‌కు అప్పటికే ఎంగేజ్‌మెంట్ అయ్యి, బ్రేకప్ అయ్యింది. విజయ్‌తో వరుస సినిమాలు చేయడం, బయట చెట్టాపట్టాలు వేసుకొని తిరగడం లాంటివి చూసి ‘ఇద్దరూ పెళ్లి చేసుకుంటారేమో’ అని అనుకున్నారంతా. అదే కొంతమంది వార్తలుగా రాశారు. ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు. ఇప్పుడు మళ్లీ నాలుగైదు రోజుల క్రితం మళ్లీ అవే మాట వినిపించింది. దీనిపై విజయ్ దేవరకొండ ఇన్‌డైరెక్ట్‌గా స్పందించారు.
విజయ్ దేవరకొండ స్పందించడంలో తప్పేమీ లేదు. తను చెప్పాలనుకున్న విషయాన్ని నేరుగా చెప్పొచ్చు. ‘సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దు’ అంటూ ఏ స్క్రీన్‌షాట్ షేర్ చేసి చెప్పొచ్చు. కానీ విజయ్ వేరే విధానాన్ని ఎంచుకున్నాడు. ‘మళ్లీ ఏదో చెత్త విషయాలు’ అంటూ రాసుకొచ్చాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే ‘As usual nonsense.. Don’t we just ❤️ da news!’. ఈ మాటలకు అర్థం అందరికీ తెలుసు. రాసిన విజయ్‌కి కూడా తెలుసు.
నాన్‌సెన్స్ వార్తలు రాశారు అని… బాధపడుతూ ఆయన ఏం రాశారో మీరూ చూశారు. సోషల్ ఇమేజ్ విషయంలో అందరితో పోటీ పడుతున్న విజయ్‌కి సోషల్ మీడియాలో ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియదా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ట్రోలింగ్ చేసేవాళ్ల లాంగ్వేజ్‌కి అత్యంత దగ్గరగా విజయ్ కామెంట్ ఉందనేది వారి అభిప్రాయం. జరగని దానిని, జరగదు అనే దానిని చెప్పడానికి చాలా మాటలు ఉన్నాయి. పై మాటలే కావాలా అంటున్నారు కూడా.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!