తెలుగులో మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీశారు వంశీ పైడిపల్లి. అతడి సినిమాలు చాలా రొటీన్ గా ఉంటాయని విమర్శలు ఉన్నప్పటికీ.. సక్సెస్ రేట్ మాత్రం ఎక్కువే. ఒక్క ‘మున్నా’ తప్పితే వంశీ తీసిన సినిమాలన్నీ హిట్స్ అనే చెప్పాలి. చివరిగా మహేష్ బాబుతో ‘మహర్షి’ సినిమా తీశారు వంశీ. ఆ తరువాత కూడా మహేష్ తోనే సినిమా చేయాలి. కానీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.
మహేష్ తో సెట్ అవ్వకపోవడంతో.. తమిళ స్టార్ హీరో విజయ్ కి కథ చెప్పి ఒప్పించారు వంశీ. దిల్ రాజు ప్రొడక్షన్ లో సినిమాను పట్టాలెక్కించారు. అదే ‘వరిసు’. తెలుగులో ‘వారసుడు’. ఈ సినిమా విషయంలో తెలుగు ఆడియన్స్ మొదట నుంచి ఒక వ్యతిరేకత భావంతోనే ఉన్నారు. ట్రైలర్ రొటీన్ గా అనిపించడంతో సినిమాపై అసలు బజ్ క్రియేట్ అవ్వలేదు.
మన దగ్గర ఇలాంటి సినిమాలు చాలానే రావడంతో ఆడియన్స్ కి కొత్తగా ఏం అనిపించలేదు. కానీ తమిళ జనాలకు మాత్రం సినిమా కనెక్ట్ అవుతుంది. తమిళంలో ముందుగానే ఈ సినిమాను రిలీజ్ చేశారు. మంచి టాక్ కూడా వచ్చింది. విజయ్ ఇమేజ్ ను వంశీ బాగా వాడుకోవడంతో అక్కడి ప్రేక్షకులు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ అయితే వంశీని తెగ పొగిడేస్తున్నారు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లను మించి విజయ్ ని బాగా ఎలివేట్ చేశారని.. తెరపై అందంగా చూపించారని వంశీపై పొగడ్తలు కురిపిస్తున్నారు. సినిమాలో హీరో తన కంపెనీకి సిఈవో అయ్యే ఎపిసోడ్ హైలైట్ ఉందట. ఆ సీన్ తమిళ ఆడియన్స్ కి బాగా నచ్చేసింది. ఆ సీన్ లో విజయ్ పాత సినిమాల రిఫరెన్స్ వాడుకోవడం అభిమానులకు నచ్చింది. ఈ సీన్ తో పాటు సినిమా మొత్తం విజయ్ ని బాగా ఎలివేట్ చేశాడట వంశీ. మొత్తానికి తమిళ తంబీల దగ్గర మార్కులు కొట్టేశారు వంశీ పైడిపల్లి. మరి తెలుగులో ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!