విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ రిలీజ్ కు మరో 13 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరిగింది. ఇప్పటికే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. తమిళనాడులో 100 కోట్ల రూపాయలకు, ఓవర్సీస్ లో 65 కోట్ల రూపాయలకు, తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల రూపాయలకు ఈ సినిమా హక్కులు అమ్ముడయ్యాయి.
కేరళ, కర్ణాటక హక్కులు 31 కోట్ల రూపాయలకు రెస్ట్ ఆఫ్ ఇండియా హక్కులు 10 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. 230 కోట్ల రూపాయల టార్గెట్ తో లియో మూవీ రికార్డ్ స్థాయి స్క్రీన్లలో విడుదలవుతూ ఉండటం గమనార్హం. విజయ్ లియో మూవీకి ఈ టార్గెట్ చిన్న టార్గెట్ కాదు. విజయ్ రెమ్యునరేషన్ 150 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాతో (LEO Movie) పాన్ ఇండియా రేంజ్ హిట్ ను సొంతం చేసుకుంటానని విజయ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
లోకేశ్ కనగరాజ్ గత సినిమా విక్రమ్, విజయ్ గత సినిమా వారసుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలన విజయాలను సొంతం చేసుకుని నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. దసరా పండుగ కానుకగా విడుదలవుతున్న సినిమాలలో ఏ సినిమాకు ఎన్ని థియేటర్లు దక్కుతాయో చూడాల్సి ఉంది. దసరా సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
విజయ్ తర్వాత ప్రాజెక్ట్ లతో సైతం బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు విజయ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. విజయ్ తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ ను అంతకంతకూ పెంచుకోవాలని ఫీలవుతున్నారు.