Vijay: నా మాటల్ని మరోసారి మార్చి రాశారు: విజయ్

థళపతి విజయ్‌ మీడియా సమావేశాలకు ఎందుకు రాడు? చాలామంది మనసులో ఈ ప్రశ్న ఉంటుంది. అయితే నేటి తరం వాళ్లకే. విజయ్‌ను ఓ పదేళ్ల నుండి ఫాలో అవుతున్నవాళ్లకు ఈ ప్రశ్న అనేదే రాదు. ఎందుకంటే పదేళ్ల క్రితం జరిగిన ఓ చిన్న పనే విజయ్‌ను మీడియాకు దూరం చేసింది అని చెప్పొచ్చు. అలా అని మీడియా ఎప్పుడూ విజయ్‌ను దూరం పెట్టాలని అనుకోలేదు. విజయ్‌ మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆ నిర్ణయం వెనుక ఉన్నది మీడియానే అని చెప్పొచ్చు.

Click Here To Watch Trailer

తాజాగా మరోసారి విజయ్‌ పాత విషయాల్ని గుర్తు చేసుకున్నాడు. ‘బీస్ట్‌’ సినిమా విడుదల సందర్భంగా విజయ్‌… దర్శకుడు నెల్సన్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆసక్తికర విషయాలను చర్చించడంతోపాటు వ్యక్తిగత విషయాలు కూడా పంచుకున్నాడు. అలా ఎందుకు మీడియాకు దూరంగా ఉంటాడు అనే విషయం మరోసారి చెప్పుకొచ్చాడు విజయ్‌. అప్పటి విషయాన్ని ఫాలో అవ్వని వారికి ఆ విషయం మరోసారి చెబుతున్నాం. విజయ్‌ తన సినిమాల విడుదల సమయంలో ఇంటర్వ్యూలు ఇవ్వడు, అంత బిజీనా అనుకుంటారు అంతా.

అదే మాట అయన దగ్గర అంటే… ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా సమయం లేనంత బిజీగా నేనేమీ లేను. అయితే 10, 11 ఏళ్ల క్రితం నాటి ఓ సంఘటన నేను ఇంటర్వ్యూలకు దూరంగా ఉండేలా చేసింది. అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన దానిని వారు మరోలా అన్వయించుకొని పత్రికల్లో రాశారు. అది కాస్త వివాదాస్పదంగా మారడంతో కొంతకాలం ప్రెస్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అయితే ఆ గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది అని విజయ్‌ చెప్పాడు. అయితే ఆ సంఘటన ఏంటనేది ఇప్పుడు చెప్పలేను అని అన్నాడు విజయ్‌. నేను మాట్లాడిన దాన్ని ఆ మీడియా వాళ్లు వివాదాస్పదమయ్యేలా రాయడం మాత్రం నిజం.

నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన తర్వాతి రోజు పేపర్లో ఆ వార్తలు చూసి ‘నేనేనా? ఇలా మాట్లాడింది?’ అని షాకయ్యాను అని చెప్పాడు విజయ్‌. ఈ విషయంలో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు కూడా అలానే అనుకున్నారు. నువ్వు ఇలా మాట్లాడావంటే నమ్మలేకపోతున్నాం అన్నారు వాళ్లు. వాళ్లకైతే జరిగింది చెప్పాను, ఇంట్లో వాళ్లకు చెప్పగలను, కానీ ప్రజలందరికీ జరిగిన విషయం చెప్పలేను కదా. అందుకే మీడియాకు దూరంగా ఉన్నాను అని చెప్పాడు విజయ్‌

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus