Vijay Sethupathi: వైరల్ అవుతున్న విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు!

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాను గెలవడంతో పాటు జనసేన అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు. పవన్ కళ్యాణ్ సాధించిన విజయం ఇతర ఇండస్ట్రీ ప్రముఖులకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగించింది. తాజాగా విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పవన్ విక్టరీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయ్ సేతుపతి నటించిన మహారాజా మూవీ ఈ నెల 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.

విజయ్ సేతుపతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నానని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ కష్టాన్ని నేను గౌరవిస్తానని నాకు నిజంగా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ఆయన గురించి చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నానని విజయ్ సేతుపతి చెప్పుకొచ్చారు. పవన్ తొడగొట్టే వీడియో ఒకటి చూశానని ఆయన తెలిపారు.

పవన్ కళ్యాణ్ చాలా మాస్ అని విజయ్ సేతుపతి కామెంట్లు చేశారు. ఆ స్థిరత్వం అనేది చాలా ముఖ్యమని పవన్ కథలో ఆయనే హీరో అని విజయ్ సేతుపతి పేర్కొన్నారు. మనిషికి పవన్ కళ్యాణ్ లాంటి మానసిక బలం చాలా అవసరమని ఆయన తెలిపారు. నాకు పవన్ గురించి ఏమీ తెలియదని నా వాట్సాప్ లో ఉన్న కొంతమంది తెలుగు వ్యక్తులు పవర్ స్టార్ అంటూ వీడియోలు పెడతారని విజయ్ సేతుపతి పేర్కొన్నారు.

పవన్ కేవలం సినిమాల్లో మాత్రమే మాస్ కాదని రియల్ లైఫ్ లో కూడా మాస్ అని వాళ్ల ద్వారా తెలిసిందని ఆయన అన్నారు. మన గురించి నెగిటివ్ కామెంట్స్ వస్తే మనం మానసికంగా ధృడంగా ఉండగలగాలని విజయ్ సేతుపతి వెల్లడించారు. పవన్ అన్నీ ఎదుర్కొని ఆయనేంటో అందరికీ చూపించారని విజయ్ సేతుపతి తెలిపారు. విజయ్ సేతుపతి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus