Vijay Sethupathi: విజయ్ సేతుపతికి మలేషియాలో ఇంతా క్రేజ్ ఉందా.. ఏం జరిగిందంటే?

భాషతో సంబంధం లేకుండా ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉన్న నటులలో విజయ్ సేతుపతి ఒకరు కాగా విజయ్ సేతుపతి యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒకవైపు పాజిటివ్ రోల్స్ లో నటిస్తూనే మరోవైపు నెగిటివ్ రోల్స్ లో నటిస్తూ విజయ్ సేతుపతి ఆకట్టుకుంటున్నారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తన 50వ సినిమా మహారాజాను కొంతకాలం క్రితమే పూర్తి చేశారు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.

తాజాగా 51వ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన విజయ్ సేతుపతి ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటానని నమ్మకంతో ఉన్నారు. మలేషియా బ్యాక్ డ్రాప్ లో లవ్, యాక్షన్, సెంటిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలేషియాలో ఇప్పటివరకు షూటింగ్ జరుపుకోని ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారని సమాచారం అందుతోంది. పత్తుమలై మురుగన్ ఆలయం దగ్గర ఈ సినిమా క్లైమాక్స్ సీన్లను షూట్ చేశారని తెలుస్తోంది.

అయితే మలేషియాలో విజయ్ సేతుపతిని (Vijay Sethupathi) చూడటానికి వేల సంఖ్యలో అభిమానులు వచ్చారట. చిరునవ్వుతో విజయ్ అభిమానులకు అభివాదం చేశారని తెలుస్తోంది. మలేషియాలో విజయ్ క్రేజ్ ను చూసి చిత్రయూనిట్ షాకైందని తెలుస్తోంది. అతి త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కానుంది. ఈ సినిమాతో విజయ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు విజయ్ సేతుపతి విలన్ రోల్స్ కు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ కానున్నాయి. విజయ్ సేతుపతి సక్సెస్ రేట్ అంతకంతకూ పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విజయ్ సేతుపతిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. విజయ్ సేతుపతి రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో సంచలనాలను సృష్టిస్తారో చూడాలి.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus