తలపతి విజయ్ కి విజయ్ సేతుపతి ముద్దు!

కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్, విజయ్ సేతుపతి కలిసి ‘మాస్టర్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్ లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. సినిమా షూటింగ్ పూర్తయిందని.

పోస్ట్ ప్రొడక్షన్ మాత్రమే మిగిలి ఉందని చిత్రబృందం వెల్లడిస్తూ ఓ ఫోటో షేర్ చేసింది.ఇందులో తలపతి విజయ్ ని ముద్దాడుతూ కనిపించారు విజయ్ సేతుపతి. ఈ ఫోటో సోషల్ మీడియాలో విడుదలై మూడు రోజులవుతున్నా.. వైరల్ అవుతూనే ఉంది. ఇప్పటకే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ గా, ఆచార్యుడిగా ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగారాజ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో విజయ్ సరసన మాళవిక హీరోయిన్ గా కనిపించనుంది. అనిరుద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అర్జున్ దాస్, ఆండ్రియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus