Vijay Sethupathi: విక్రమ్ సక్సెస్ తో విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ పెరిగిందా?

భాషతో సంబంధం లేకుండా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సెలబ్రిటీలలో విజయ్ సేతుపతి ఒకరు. విజయ్ సేతుపతి నటిస్తే ఆ సినిమాపై ఊహించని స్థాయిలో క్రేజ్ ఏర్పడుతుందని చెప్పవచ్చు. విజయ్ సేతుపతి నటించిన సినిమాలకు ఊహించని స్థాయిలో రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. అయితే సినిమాసినిమాకు విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ కూడా పెరుగుతుండటం గమనార్హం. విజయ్ సేతుపతి విక్రమ్ సినిమాకు 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా తర్వాత ప్రాజెక్ట్ లకు 21 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

విజయ్ సేతుపతి అడిగినంత ఇవ్వడానికి నిర్మాతలు సైతం ఓకే చెబుతున్నారని సమాచారం అందుతోంది. జవాన్ సినిమా కోసం విజయ్ సేతుపతి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోనున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ హీరోగా చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. నయనతార, సాన్యా మల్హోత్రా ఈ సినిమాలో నటిస్తున్నారు.

సౌత్ లో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా విజయ్ సేతుపతి తన సినీ కెరీర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సినిమా ఇదే కావడం గమనార్హం. జవాన్ సినిమా కోసం విజయ్ సేతుపతి రెండు సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని అందుకే విజయ్ సేతుపతి ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సినిమాను నిర్మిస్తోంది. హిందీతో పాటు అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది జూన్ నెల 2వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus