విజయ్ సేతుపతి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళంలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయ్యాడు. తరువాత ‘నా పేరు శివ’ లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసాడు. ఇప్పుడు అక్కడ ఏకంగా స్టార్ హీరో రేంజ్ స్టేటస్ ను సంపాదించుకున్నాడు. ఇక తెలుగు ప్రేక్షకులకు కూడా ‘పేట’ ‘సైరా’ ‘మాస్టర్’ ‘ఉప్పెన’ చిత్రాలతో బాగా దగ్గరయ్యాడు. బాలీవుడ్లో కూడా ఇతను ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకు గాను కోట్లల్లో పారితోషికం అందుకోబోతున్నాడు.
ఇతని ఎదుగుదలను చూసి మిగిలిన హీరోలు కూడా అసూయపడుతుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. ఇంత సాధించిన విజయ్ సేతుపతిని గొప్ప అంటే అందరూ ఏకీభవించకపోవచ్చేమో..! కానీ అతను ఇటీవల చేసిన ఓ పనికి మాత్రం అందరూ హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. విషయం ఏమిటంటే.. విజయ్ సేతుపతి కెరీర్ ప్రారంభంలో ఒక పూట తిండి కోసం చాలా కష్టాలు పడేవాడట. ఆ టైములో డైరెక్టర్ ఎస్.పి.జననాథన్ సేతుపతిని ఆదుకుని భోజనం పెట్టించారు. అలాంటి ఆయన..
మార్చి 14న బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రాణాలు కోల్పోయారట. ఈ వార్త తెలుసుకున్న విజయ్ సేతుపతి..వెంటనే జననాథన్ చనిపోయిన ఆసుపత్రికి వెళ్ళాడట. ఆయన భౌతిక కాయాన్ని వాళ్ల ఇంటికి చేర్చే వరకూ ఏడుస్తూనే ఓ సామాన్యుడిలా వెంటే ఉన్నాడట. దహన సంస్కారాలు పూర్తిచేసి వారి కుటుంబ సభ్యులను ఓదార్చి వెళ్ళాడట మన మక్కల్ సెల్వన్.ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనడానికి మన విజయ్ సేతుపతే నిదర్శనం.
Most Recommended Video
శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!