Vijay Sethupathi: విజయ్ సేతుపతికి నిజంగానే అతిస్తున్నారా..?

సౌత్ లో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఇలా అన్ని రకాల పాత్రల్లో నటించి మెప్పిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన ‘విక్రమ్’ సినిమాలో సంతానం అనే క్యారెక్టర్ లో విజయ్ సేతుపతి పెర్ఫార్మన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినిమాకి అతడి క్యారెక్టర్ హైలైట్ గా నిలిచింది. అలాంటి నటుడు తమ సినిమాలో ఉండాలని ప్రతి దర్శకుడు కోరుకుంటాడు.

తమిళ దర్శకుడు అట్లీ.. హిందీలో చేయబోతున్న తొలి సినిమా కోసం విజయ్ సేతుపతినే విలన్ గా ఎన్నుకున్నారు. ‘జవాన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీలకపాత్రలకు తమిళ నటులనే ఎన్నుకున్నారు అట్లీ. హీరోయిన్ గా నయనతారను, విలన్ గా విజయ్ సేతుపతిని కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాకి విజయ్ సేతుపతి తీసుకోబోతున్న రెమ్యునరేషన్ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది.

‘జవాన్’లో విలన్ పాత్ర పోషించడానికి విజయ్ ఏకంగా రూ.21 కోట్లు తీసుకోబోతున్నట్లు చెబుతున్నారు. దీని గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ.. నిజంగానే విజయ్ సేతుపతికి అంతిస్తున్నారా..? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. తమిళంలో అయితే విజయ్ సేతుపతికి లీడ్ క్యారెక్టర్ చేయడానికి రూ.10 కోట్ల రేంజ్ లోనే రెమ్యునరేష ఇస్తున్నారని.. ఇక విలన్, క్యారెక్టర్ రోల్స్ అంటే రెమ్యునరేషన్ తగ్గుతుందని అంటున్నారు.

‘ఉప్పెన’ సినిమాలో విలన్ రోల్ చేసినందుకు విజయ్ సేతుపతి రూ.5కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారు. అలాంటిది ఇప్పుడు బాలీవుడ్ సినిమా కోసం విజయ్ కి రూ.21 కోట్లు ఇస్తారా..? అనేది డౌట్. అసలు బాలీవుడ్ లో గడ్డుకాలం నడుస్తుంది. ఇలాంటి సమయంలో విజయ్ కి అంతిస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus