షారుఖ్ మీద ఉన్న ప్రేమ సొంత నిర్మాత మీద లేదా..?

  • January 10, 2023 / 04:33 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘వారసుడు’ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను తెలుగు దర్శకుడు, నిర్మాత కలిసి తెరకెక్కించారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తే తెలుగు ఫ్యాన్స్ కోసం కనీసం ఒక ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చేంత తీరికలో లేడనే మాటలు వినిపిస్తున్నాయి. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో మీడియా ఈ విషయం గురించి దిల్ రాజుని ప్రశ్నించింది.

దానికి ఆయన.. ఇంటర్వ్యూ లేదా ఒక వేడుకలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఇస్తారని.. దాన్నే వాడుకోవాలని చెప్పారు. పోనీ సరే అనుకుంటే.. కనీసం ‘వారసుడు’ తెలుగు ట్రైలర్ ను విజయ్ ఇప్పటివరకు తన ట్విట్టర్ లో షేర్ చేయకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సాధారణంగా హీరోలు తమ సినిమాలు ఎన్ని భాషల్లో రిలీజ్ అయితే అన్ని ట్రైలర్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. కానీ విజయ్ మాత్రం ‘వారసుడు’ తెలుగు ట్రైలర్ ని పట్టించుకోలేదు.

కానీ తాజాగా విడుదలైన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ ట్రైలర్ ని మాత్రం ట్వీట్ చేసి స్పెషల్ గా ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఒక బాలీవుడ్ హీరో సినిమా గురించి తమిళ తారలు ఇలా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం రేర్ అనే చెప్పాలి. అయితే దీనికొక కారణం ఉంది. షారుఖ్ నెక్స్ట్ ఫిల్మ్ ‘జవాన్’లో విజయ్ గెస్ట్ రోల్ చేస్తున్నారు. దానికి అట్లీ డైరెక్టర్. ఇదివరకు విజయ్ తో మూడు సూపర్ హిట్లు తీశారు అట్లీ. అందుకే అట్లీ అంటే విజయ్ కి ఎంతో అభిమానం. ఆయన అడిగిన వెంటనే గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు.

ఒక చిన్న పాత్ర చేసినందుకే షారుఖ్ మీద ఇంత అభిమానం చూపిస్తే.. విజయ్ ని నమ్మి అతడిపై కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ కోసం కనీసం ఒక డబ్బింగ్ ట్రైలర్ ని కూడా షేర్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తెలుగులో పెద్దగా మార్కెట్ లేని విజయ్ కోసం దిల్ రాజు ఎంతో కష్టపడి ఇంత పెద్ద రిలీజ్ ఇస్తున్నందుకైనా విజయ్ సినిమాను ప్రమోట్ చేస్తే బావుండేది. కనీసం నెక్స్ట్ రెండు, మూడు రోజుల్లోనైనా విజయ్ ‘వారసుడు’ సినిమాను తెలుగు ప్రమోట్ చేస్తారేమో చూడాలి!

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus