తెలుగులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి ఏ రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో.. తమిళంలో ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా విజయ్ (Vijay Thalapathy) ఎప్పుడో చరిత్ర కెక్కాడు. ఒకప్పటి దర్శకులు ఎస్.ఎ.చంద్రశేఖర్ గారి అబ్బాయిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. అటు తర్వాత సూర్య (Suriya), అజిత్ (Ajith) ..ల హవా పెరగడంతో డౌన్ అయినట్టు కనిపించినా మురుగదాస్ (A.R. Murugadoss).. విజయ్ కి ‘తుపాకీ’ (Thuppakki) తో లైఫ్ ఇవ్వడంతో మళ్ళీ పుంజుకున్నాడు.
ఆ తర్వాత మళ్ళీ విజయ్ కి పూర్వ వైభవం దక్కినట్టు అర్ధం చేసుకోవచ్చు. ఇటీవల సొంతంగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్.. ‘ఎంత వరకు రాణించగలడు?’ అనే చర్చకి తెరలేపాడు. రాజకీయాల్లో నిలబడాలి అన్నా, పార్టీని నడపాలి అన్నా భారీగా ఖర్చు పెట్టాలి. మరి ఆ స్థాయిలో విజయ్ కి ఆస్తులు ఉన్నాయా? అనే ప్రశ్నలు చాలా మందిలో మెదులుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. విజయ్ ఆస్తుల విలువ రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
అతనికి చెన్నై, సముద్ర తీరాన విలాసవంతమైన బంగ్లా ఉంది. హై టెక్నికల్ స్టాండర్డ్స్ కలిగిన కార్లు ఉన్నాయి. వాణిజ్య ప్రకటనల ద్వారా విజయ్ ఏడాదికి రూ.120 కోట్లు వరకు సంపాదిస్తున్నాడట. ఇక ఒక్కో సినిమాకి దాదాపు రూ.70 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు అందుకుంటూ వచ్చారు విజయ్. అంతేకాదు ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం’ (The Greatest of All Time ) సినిమాకి రూ.150 కోట్లు అందుకున్నారు. ఇప్పుడు చేయబోయే సినిమాకి రూ.200 కోట్లు అందుకుంటున్నారని టాక్.
అతని ఫామ్ హౌస్..ల వాల్యూ రూ.80 కోట్లు ఉంటుందట. ఇక విజయ్ కి రోల్స్ రాయిస్ ఘోస్ట్ , బీఎండబ్ల్యూ x5, బీఎండబ్ల్యూ x6 , మెర్సిడెస్ బెంజ్ జి ఎల్ ఏ, ఫోర్డ్ మస్టాంగ్ వంటి కార్లు ఉన్నాయి. వీటి వాల్యూ ఒక్కోటి కోటిన్నర పైనే ఉంటుందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొత్తంగా విజయ్ కి వెయ్యి కోట్ల వరకు ఆస్తి ఉంటుంది. ఇది అతను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి అని సమాచారం.