Vijay, Tamannaah: లంచ్ డేట్ అంటూ ఫోటో షేర్ చేసిన విజయ్ వర్మ.. తమన్నా ఎక్కడ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అభిమానులు మిల్కీబ్యూటీ అంటూ పిలుచుకునే తమన్నా కొన్నాళ్లుగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ ఈవెంట్లో ఈ జంట ముద్దు పెట్టుకున్న వీడియో బయటకు రావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరిందని చెప్పాలి! గోవాలో జరిగిన కొత్త సంవత్సరం వేడుకల్లో ఈ జంట బహిరంగంగానే రొమాన్స్ చేస్తూ మీడియా కంట పడింది. అటు తర్వాత ముంబై ఎయిర్ పోర్ట్ లో , అలాగే అవార్డుల ఈవెంట్ లో కూడా ఈ జంట కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

అయితే వీళ్ళిద్దరూ కలిసి ఓ బాలీవుడ్ సిరీస్ లో నటిస్తున్నారు కాబట్టి.. ప్రమోషన్లో భాగంగా ఇలా కలిసుంటున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అది బాలీవుడ్లో తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. గతంలో ఓ సినిమాలో జంటగా నటించే నటీనటులు కలిసి తిరిగితే వాళ్ళ గురించి ఎక్కువ వార్తలు వచ్చేవి.. ఆ విధంగా ఆ సినిమా గురించి ఎక్కువ చర్చ జరిగేది. హైప్ పెరగడానికి అలాంటి రూమర్స్ కావాలనే క్రియేట్ చేసుకునే వాళ్ళు.

అయితే ఇప్పుడు మాత్రం విజయ్ – తమన్నా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే ఈ విషయాన్ని రివీల్ చేస్తారని అంతా భావిస్తున్నారు. అయితే ఈ వార్తలకు విజయ్ క్లారిటీ ఇచ్చాడు.ఇటీవల ఓ లంచ్ డేట్ కోసం విజయ్, తమన్నా మళ్ళీ కలిశారని ఓ వార్త హల్ చల్ చేసింది. ఇందుకు విజయ్.. ‘ మేమిద్దరం డేటింగ్లో లేమని’ క్లారిటీ ఇచ్చాడు. తన అప్ కమింగ్ ప్రాజెక్టు ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ డైరెక్టర్ సుజోయ్ ఘోష్తో ఉన్న ఫోటోని షేర్ చేసి..

“ఇదే నా అసలు లంచ్ డేట్” అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో విజయ్ – తమన్నా ల సహజీవనం పై వస్తున్న వార్తలు వట్టి పుకార్లే అని తేలిపోయింది. ఆ పోస్ట్ కూడా వైరల్ అవుతుంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus