కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న సమయంలో హీరో విజయ్ ఫ్యాన్స్ ను హెచ్చరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ సినిమాకి సంబంధించి అభిమానులను..
రాజకీయ పార్టీలు, అధికారుల్ని విమర్శించే విధంగా, అవహేళన చేసే రీతిలో వ్యవహరించ వద్దని సూచించారు. గత కొన్నేళ్లుగా విజయ్ నటించిన సినిమాలన్నీ వివాదాల మధ్య తెరమీదకు వచ్చిన సంగతి తెలిసిందే. విడుదలకు ముందుగా చోటు చేసుకునే పరిణామాలే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో తమిళ కొత్త సంవత్సరానికి ఒకరోజు ముందుగా ఈ నెల 13వ తేదీ విజయ్ నటించిన సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విజయ్ ముందు జాగ్రత్త పడుతున్నారు. ఇందులో భాగంగా.. గురువారం విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్ అభిమాన సంఘాల్ని హెచ్చరిస్తూ ప్రకటన విడుదల చేశారు. రాజకీయ పార్టీలను, పదవుల్లో ఉన్న వారిని, అధికారులను.. ఇలా ఎవరినీ విమర్శించ వద్దని హెచ్చరించారు. మీడియాలో కానీ, సోషల్ మీడియాలో గానీ.. ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మీమ్స్ లాంటి అవహేళన చేసే ధోరణుల్ని అనుసరించవద్దని హెచ్చరించారు.
ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై గతంలో కఠినంగా వ్యవహరించి, అభిమాన సంఘం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. ఈసారి రూల్స్ ను అతిక్రమించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు సైతం తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!