ఆంధ్రప్రదేశ్ కి చెందిన విలన్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన విజయ రంగరాజు పలుభాషల్లో నటించినా తెలుగులో యజ్ఞం సినిమాతో మంచి పేరు వచ్చింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు తోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను మంచి సినిమా అవకాశాలు అందుకున్నారు. అయితే ఆయన తండ్రి ఆర్మీ ఆఫీసర్ అవడం వల్ల పూణే లో పుట్టి అక్కడే పెరిగారు. అయితే రాయలసీమ లోని గుంతకల్లులో చదువు పూర్తి చేసారు.
ఇక నాటకాలు, సినిమాలు అంటే పిచ్చి ఉండటం వల్ల వాటి మీద ఫోకస్ చేసారు. చెన్నై వెళ్లి దాదాపు 100 నాటకాలు వేసారు. ఇక సినిమాల్లో ఎన్టీఆర్ గారంటే చాలా ఇష్టమంటూ చెప్పే రంగరాజు గారు తన కెరీర్ అలాగే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. విజయ రంగరాజు దాదాపు దక్షిణాదిన అన్ని భాషలలోనూ నటించారు. అయితే ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో ఫేమస్ అయ్యారు.
తెలుగులో విజయ రంగరాజు (Vijaya Rangaraju) కాగా తమిళంలో రాజ్ కుమార్ అని ఇక సౌత్ శెట్టి ఇలా అన్ని పేర్లు ఉండటం వల్ల కొన్ని అవకాశాలు వదులుకున్నాను అంటూ చెప్పారు. ఇక మొదట్లో రజనీకాంత్ గారి సినిమాలో నటించేటపుడు పరిచయం పెరిగి ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత చనువు ఉంది అంటూ చెప్పారు.విజయ రంగరాజు దాదాపు దక్షిణాదిన అన్ని భాషలలోనూ నటించారు.
అయితే ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో పేరుతో ఫేమస్ అయ్యారు. తెలుగులో విజయ రంగరాజు కాగా తమిళంలో రాజ్ కుమార్ అని ఇక సౌత్ శెట్టి ఇలా అన్ని పేర్లు ఉండటం వల్ల కొన్ని అవకాశాలు వదులుకున్నాను అంటూ చెప్పారు. ఇక మొదట్లో రజనీకాంత్ గారి సినిమాలో నటించేటపుడు పరిచయం పెరిగి ఆయనతో వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత చనువు ఉంది అంటూ చెప్పారు.