రానా నాయుడు వెబ్ సిరీస్ పై ఫైర్ అయిన విజయశాంతి!

ఒకప్పటి స్టార్ హీరోయిన్,ఇప్పటి పొలిటీషియన్ అయిన విజయశాంతి.. ఇటీవల రిలీజ్ అయిన ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పై పరోక్షంగా కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ ద్వారా ఆమె స్పందిస్తూ.. “ఈ మధ్యనే విడుదలైన ఒక తెలుగు (బహుబాషా) ott సిరీస్ పై……”It needs Strict Censoring for ott platform”…అనే విషయమై అనేకమంది ప్రజలు, ప్రత్యేకించి మహిళలు ఈ సమస్య ముందుకు ఇప్పటికే తెస్తున్నారు.

ప్రజల మనోభావానుసారం నేను చెప్తున్న అంశం అర్థం చేసుకుని, తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల దాకా తెచ్చుకోక, సంబంధిత నటులు, మరియు నిర్మాతలు Ott నుండి నిరసించబడుతున్న పై ప్రసారాలని తొలగించి భవిష్యత్‌లో దేశవ్యాప్త ott ప్రసారాలలో ఎక్కడైనా ప్రజా ప్రత్యేకించి మహిళా వ్యతిరేకతకు గురి అయ్యే విధానాలు లేని పద్ధతులు పాటించాలని భావిస్తూ.. తమకు ప్రజలు ఇచ్చిన అభిమానాన్ని, మరింత గౌరవంతో నిలబెట్టుకుంటారని అభిప్రాయపడుతున్నాను.—” అంటూ విజయశాంతి రాసుకొచ్చారు.

అయితే ఆ వెబ్ సిరీస్ పేరు కానీ, అందులో నటించిన నటీనటుల పేర్లు కానీ ఆమె ప్రస్తావించలేదు. కానీ ఇది వెంకటేష్- రానా లు కలిసి నటించిన వెబ్ సిరీస్ ను ఉద్దేశించే ఆమె ఈ కామెంట్లు చేసినట్లు క్లియర్ గా తెలుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్, బూతులు ఎక్కువగానే ఉంటాయి. వెంకటేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ లో క్రేజ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో… అసలు ఫ్యామిలీతో 10 నిమిషాలు కూడా చూడలేనటువంటి ఇలాంటి వెబ్ సిరీస్ లు చేయడమేంటి అంటూ అంతా అభిప్రాయపడుతున్నారు.

సినిమాలో అడల్ట్ కంటెంట్ సినిమాలు ఉన్నా పర్వాలేదు కానీ ‘కొడుకుతో శృంగారంలో పాల్గొనాలి, కోడలి ముందు … మనవడు మనవరాలి ముందు ‘బోండాలు చూస్తున్నారా’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులు చెప్పడం వంటివి చాలా అసభ్యకరంగా ఉన్నాయని మండిపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus