వెంకటేశ్, రానాలపై విజయశాంతి కోపానికి కారణమిదే!

విక్టరీ వెంకటేశ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన రానా నాయుడు వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఎక్కువమంది నెగిటివ్ కామెంట్లు చేసినా నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ టాప్ లో నిలిచింది. అయితే ప్రముఖ సెలబ్రిటీల నుంచి ఈ వెబ్ సిరీస్ విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. అయితే కొంతమంది సెలబ్రిటీలు వెంకటేశ్, రానాలపై డైరెక్ట్ గా ఫైర్ అయితే మరి కొందరు పరోక్షంగా ఫైర్ అవుతున్నారు.

అయితే ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటీమణులలో ఒకరైన విజయశాంతి సైతం ఈ వెబ్ సిరీస్ పై ఫైర్ కావడం గమనార్హం. సోషల్ మీడియా పోస్టుల ద్వారా విజయశాంతి ఈ వెబ్ సిరీస్ విషయంలో ఆవేదనను వ్యక్తం చేశారు. విజయశాంతి తన పోస్ట్ లో ఈ మధ్య కాలంలో రిలీజైన ఒక బహు భాషా ఓటీటీ సిరీస్ గురించి పోస్ట్ లో ప్రస్తావిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఆ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కు సెన్సార్ అవసరమని విజయశాంతి తెలిపారు.

ఈ విషయం గురించి అనేక మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఇప్పటికే ముందుకు తెస్తున్నారని విజయశాంతి చెప్పుకొచ్చారు. ప్రజల మనోభావాలను అనుసరించి నేను చెబుతున్న విషయాలను అర్థం చేసుకోవాలని ఆమె కామెంట్లు చేశారు. తీవ్ర మహిళా వ్యతిరేకతతో కూడిన ఉద్యమాల వరకు తెచ్చుకోవద్దని విజయశాంతి కామెంట్లు చేశారు. సంబంధిత నటులు, ప్రొడ్యూసర్లు ఓటీటీ నుంచి నెగిటివ్ కామెంట్లు వస్తున్న ప్రసారాలను తొలగించాలని ఆమె కోరారు.

భవిష్యత్తులో దేశంలో ప్రసారమయ్యే ఓటీటీలలో మహిళా వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని విజయశాంతి చెప్పుకొచ్చారు. వెంకటేశ్, రానాలపై విజయశాంతి పరోక్షంగా ఫైర్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. విజయశాంతి సెకండ్ ఇన్నింగ్స్ లో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు. విజయశాంతి కెరీర్ పరంగా మరింత ఎదగాలని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus