జాతీయ అవార్డు గ్రహీత, లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరొందిన విజయశాంతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో కూడా నటించి బ్లాక్ బస్టర్లు అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘ఒసేయ్ రాములమ్మ’ టైంలో ఆమె సినిమాలను తగ్గించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.మొదట సొంతంగా పార్టీ పెట్టిన విజయశాంతి ప్రస్తుతం బీజేపీలో చేరి యాక్టివ్‌గా ఉంటున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవితో సహా మరికొంతమంది హీరోల పై ఆమె 2008 ఆ టైంలో విమర్శలు గుప్పించింది. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డ.. విజయశాంతి చిరంజీవి, నాగార్జున వంటి హీరోల పై విరుచుకుపడింది. ‘ఎదుటి వాళ్ళ ఆలోచన శైలి సరిగ్గా లేనప్పుడు, వాళ్ళ ప్రజలకు న్యాయం చేయలేదని అనిపించినప్పుడు న్యాచురల్‌గానే వేలెత్తి చూపిస్తాను. ఒకప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుందని.. ఈ విషయంపై స్పందించమని హీరోలను అడిగితే ఎవ్వరూ మాట్లాడలేదు.
తెలంగాణ ప్రజలు ఆదరించడం వల్లే కదా వాళ్ళు స్టార్లు అయ్యి భారీ పారితోషికాలు తీసుకున్నది. ‘సినిమాల్లో ఇలా చేశాం, అలా చేశామని చెప్పే వాళ్లంతా బయట ప్రజలకు ఏమైనా చేస్తున్నారా? కనీసం 20 శాతం కూడా ఏం చేయట్లేదు. హీరోలెవరికి గట్స్ లేవు. ఈ హీరోలంతా ముసుగు దొంగలు’ అంటూ ఆమె ఓ రేంజ్లో ఫైర్ అయ్యింది.
ఈ వీడియో పాతదే అయినప్పటికీ మళ్ళీ వైరల్ అవుతుంది. ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి- విజయశాంతి లు ఈ విషయాలు గుర్తు చేసుకుని నవ్వుకోవడంతో అంతా సర్దుకున్నట్టే కనిపించింది. చిరు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటూ హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నారు కాబట్టి.. ఇలాంటి కాంట్రవర్సీలకు కూడా ఆయన దూరంగా ఉన్నట్టే..!