Vijayashanti: మా ఎన్నికలపై స్పందించిన సీనియర్ హీరోయిన్!
- June 28, 2021 / 11:37 AM ISTByFilmy Focus
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రోజురోజుకి రసవత్తరంగా ఆడుతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణు, నటి హేమ పోటీ పడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నటి జీవిత రాజశేఖర్ ప్యానెల్ తో సంబంధం లేకుండా పోటీ చేస్తారని అంటున్నారు. ఇప్పుడు మరో నటుడు సీవీఎల్ నరసింహారావు ‘మా’ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ‘మా’ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు.
ఇప్పుడు ఆయనకు మద్దతుగా నటి విజయశాంతి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘మా’ సభ్యురాలిని కాకపోయినా.. ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పందిస్తున్నానని చెప్పిన విజయశాంతి.. తన మద్దతు నరసింహారావు గారికే అని చెప్పింది. ఎన్నికలపై ఆయన ఆవేదన న్యాయమైనదని వ్యాఖ్యానించారు. ఇక సీవీఎల్ నరసింహారావు తన ప్యానెల్ తెలంగాణ వాదమని చెప్పారు. తెలంగాణ కళాకారులు, వాళ్ల ఇబ్బందులే తన ఎజెండా అని.. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చిన్న, పెద్ద, మధ్య తరగతి కళాకారులు ఉన్నారని..

వాళ్లకు జరుగుతున్న అన్యాయం కూడా.. మ్యానిఫెస్టోలో ముఖ్య అంశమని చెప్పుకొచ్చారు. ‘మా’కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు విభాగాలు చేసి.. రెండింటికీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!











