Vijayendra Prasad: విజయేంద్రప్రసాద్‌ పాన్‌ ఇండియా సినిమా ఇదే..!

ప్రముఖ కథా రచయిత, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్‌ ఓ పాన్‌ ఇండియా సినిమాకు కథ రాస్తున్నారని ఆ మధ్య మనం విన్నాం. ఓ బెంగాళీ నవల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని కూడా చెప్పాం. తాజాగా ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను చిత్రబృందం వెల్లడించింది. ముందుగా చెప్పినట్లుగా టాలీవుడ్‌కి చెందిన యువ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ‘1770’ అనే పేరు పెట్టారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ…

‘1770’ సినిమాకు దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆకాశవాణి’ సినిమాతో ఇప్పటికే ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశారు. బంకించంద్ర ఛటర్జీ రచించిన ఆనందమఠ్‌ నవల ఆధారంగా.. ఈ సినిమా కథను విజయేంద్ర ప్రసాద్‌ రాశారు. శైలేంద్రకుమార్‌, సుజయ్‌ కుట్టి, కృష్ణకుమార్‌.బి, సూరజ్‌ శర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆనందమఠ్‌ నవలలోని వందేమాతరం గీతం రాసి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

‘1770’ని తెలుగుతోపాటు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ భాషల్లో తెరకెక్కిస్తారు. దీపావళి నాటికి సినిమా టీమ్‌ మొత్తాన్ని సిద్ధం చేసుకుని, అనౌన్స్‌ చేస్తామని ప్రకటించారు. ‘‘అన్యాయానికి వ్యతిరేకంగా జాతినంతటినీ ఏకం చేసి పోరాడేలా వందేమాతరం గీతం చేసింది. 1779లో స్వాతంత్య్ర సమరం కోసం మొయన ప్రాంతంలో స్ఫూర్తిని రగిల్చిన యోధులెంతోమంది ఉన్నారు. వాళ్లందరి గురించి తెలియజేసే చిత్రమే ఇది’’ అని రచయిత విజయేంద్రప్రసాద్‌ తెలిపారు.

అశ్విన్‌ గంగరాజు రాజమౌళి దగ్గర ‘ఈగ’, ‘బాహుబలి’ తదితర చిత్రాలకు సహాయ దర్శకుడిగా పని చేశారు. రాజమౌళికి కాకుండా విజయేంద్రప్రసాద్‌ గతంలో ఇతరులకు కథ అందించిన ‘మణికర్ణిక’, ‘భజరంగీ భాయిజాన్‌’, ‘మెర్సెల్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ దగ్గర మంచి విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘1770’ సినిమాకు కథ అందిస్తుంటంతో ఈ సినిమాపైనా అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus