Vikramarkudu 2: విక్రమార్కుడు2 మూవీ డైరెక్టర్ జక్కన్న కాదా?

రవితేజ హీరోగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్యూయల్ రోల్ లో విక్రమార్కుడు సినిమాలో రవితేజ చేసిన సందడి అంతాఇంతా కాదు. ఈ జనరేషన్ ప్రేక్షకులను సైతం విక్రమార్కుడు సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది. అయితే విజయేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు2 సినిమా స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టు సమాచారం. 15 సంవత్సరాల క్రితం విక్రమార్కుడు రిలీజ్ కాగా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ కావడంతో పాటు అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

విక్రమార్కుడు సీక్వెల్ ను రాజమౌళి తెరకెక్కించే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. పాన్ ఇండియా సినిమాగా విక్రమార్కుడు2 తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి తర్వాత సినిమా మహేష్ బాబు హీరోగా ఇప్పటికే ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. విజయేంద్ర ప్రసాద్ విక్రమార్కుడు2 సినిమాను ఏ దర్శకుని చేతిలో పెడతారో చూడాల్సి ఉంది. ఈ సినిమా కథకు సంబంధించి ప్రముఖ నిర్మాణ సంస్థలు విజయేంద్ర ప్రసాద్ తో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

రాజమౌళి స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటే విజయేంద్ర ప్రసాద్ కూడా స్టార్ రైటర్ గా అన్ని భాషల్లో గుర్తింపును సంపాదించుకుంటున్నారు. జక్కన్న ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పొస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus