దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు కథ అందించిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్వ్యూ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్ కొమురం భీమ్, సీతారామరాజు ఇద్దరూ దేశభక్తులే అని అన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో వాళ్ల ఆటోబయోగ్రఫీ చెప్పనని వాళ్లను ఆదర్శంగా తీసుకుని ఒక్క క్షణం అలా బ్రతకాలనే స్పూర్తి ప్రజలకు కలగాలని చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ కథలో ఎన్నో భావోద్వేగాలు ఉంటాయని ప్రేక్షకులకు ఆర్‌ఆర్‌ఆర్ ఖచ్చితంగా నచ్చుతుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
హీరోల ఇమేజ్ ను కథలో ఇరికించే ప్రయత్నం చేయకూడదని మంచి కథ కుదరడం, అందుకు తగిన హీరోలు దొరకడం తమకు ప్లస్ అవుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్ మూవీ నుంచి ప్రేక్షకులు దేశభక్తినే కోరుకుంటారని విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ చాలా తృప్తికరంగా వచ్చిందని ఏవైనా పొరపాట్లు చెబితే రాజమౌళి వాటిని సరిదిద్దుకుంటారని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. రాజమౌళి పిలిస్తే మాత్రమే తాను సెట్స్ కు వెళతానని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. రియల్ లైఫ్ లో కూడా చరణ్, తారక్ మంచి స్నేహితులని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
సినిమాకు కథే పునాది అని కథ బాగుంటేనే దర్శకుడు, నిర్మాత దానిని మరో స్థాయికి తీసుకొని వెళ్లడం సాధ్యమవుతుందని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. భారీ సినిమాలు వెండితెరపై చూడటానికే బాగుంటాయని థియేటర్ పై వచ్చే ఆదాయమే నిర్మాతను నిలబెడుతుందని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. రాజమౌళికి స్పోర్ట్స్, వ్యవసాయం, ఇతర ఇష్టాలు ఉన్నాయని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.