యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండీ ‘విశ్వరూపం 2’ తర్వాత వస్తున్న చిత్రం ‘విక్రమ్’. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సూర్య కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేయడం జరిగింది. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.ఈరోజు అనగా జూన్ 3న ‘విక్రమ్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది.
ఈ చిత్రానికి తెలుగులో మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం
2.7 cr
సీడెడ్
1.48 cr
ఉత్తరాంధ్ర
1.6 cr
ఈస్ట్
0.39 cr
వెస్ట్
0.32 cr
గుంటూరు
0.38 cr
కృష్ణా
0.34 cr
నెల్లూరు
0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
7.48 cr
‘విక్రమ్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలి రోజు ఈ చిత్రానికి బుకింగ్స్ బాగున్నాయి. అయితే మరో పక్క ‘మేజర్’ వంటి మరో క్రేజీ మూవీ పోటీగా ఉంది. అలాగే గత వారం రిలీజ్ అయిన ‘ఎఫ్3’ కూడా ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. వాటి పోటీని తట్టుకుని మొదటి వీకెండ్ ఈ మూవీ ఎంత వరకు రాబడుతుంది అనేది చూడాలి..!