యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండి ‘విశ్వరూపం 2’ తర్వాత వచ్చిన చిత్రం ‘విక్రమ్’. ‘మహా నగరం’ ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా ప్రధాన పాత్రలు పోషించారు.’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్య కూడా ఈ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేయడం జరిగింది. స్టార్ హీరో నితిన్ హోమ్ బ్యానర్ అయిన ‘శ్రేష్ఠ్ మూవీస్’ వారు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఇక జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ కే 85 శాతం వరకు రికవరీ సాధించింది.ఒకసారి 3 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :
నైజాం | 2.41 cr |
సీడెడ్ | 0.89 cr |
ఉత్తరాంధ్ర | 0.92 cr |
ఈస్ట్ | 0.59 cr |
వెస్ట్ | 0.40 cr |
గుంటూరు | 0.49 cr |
కృష్ణా | 0.45 cr |
నెల్లూరు | 0.31 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.46 cr |
‘విక్రమ్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.7.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ. 7.6 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.46 కోట్ల షేర్ ను రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు రూ.1.14 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘మేజర్’ ‘ఎఫ్3’ వంటి సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ఈ మూవీ బాగా కలెక్ట్ చేసింది. వీకెండ్ కూడా స్టడీగా రాణిస్తే మొదటి వారమే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!