‘విశ్వరూపం 2’ తర్వాత యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నుండి వచ్చిన చిత్రం ‘విక్రమ్’. ‘ఖైదీ’ ‘మాస్టర్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాలను అందించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ లో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రలు పోషించారు.’రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై ఆర్ మహేంద్రన్ తో కలిసి కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
సూర్య కూడా ఈ చిత్రంలో రోలెక్స్ అనే స్పెషల్ రోల్ చేసి థియేటర్లు దద్దరిల్లేలా చేశాడు. టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తమ ‘శ్రేష్ఠ మూవీస్’ బ్యానర్ పై తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేశారు.ఇక జూన్ 3న విడుదలైన ‘విక్రమ్’ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని… ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. వరల్డ్ వైడ్ గా ఇప్పటికే ఈ చిత్రం రూ.360 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
తమిళ వెర్షన్ పరంగా అయితే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ చిత్రాన్ని 4 వారాల్లో ఓటిటి రిలీజ్ చేయాలని మొదట అనుకున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రం ఇప్పటికీ కొన్ని ఏరియాల్లో బాగా కలెక్ట్ చేస్తుండడంతో ఒక వారం వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది.
దాని ప్రకారం ఈ చిత్రం జూలై 8 నుండి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వెర్షన్లలో స్ట్రీమింగ్ కాబోతుందట.