Vikram Movie: ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ కి సిద్ధమైన విక్రమ్!

కోలీవుడ్ లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజ్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని స్థాయిలో విజయం సాధించి మంచి కలెక్షన్లను రాబట్టింది.ఈ సినిమా ఏకంగా 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఇక ఈ సినిమా కేవలం థియేటర్లో మాత్రమే కాకుండా డిజిటల్ మీడియాలోనూ అలాగే టెలివిజన్ ప్రీమియర్ గా కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది.

ఇలా విక్రమ్ సినిమా ఎన్నో అద్భుతమైన రికార్డులను సృష్టించిందని చెప్పాలి. ఇకపోతే ఈ సినిమా విడుదలై దాదాపు 100 రోజులను పూర్తి చేసుకున్నప్పటికీ ఈ సినిమా మరొక ఘనత సాధించిందని చెప్పాలి. ఇప్పటివరకు కమల్ హాసన్ నటించిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన సినిమాగా విక్రమ్ సినిమా రికార్డు సృష్టించింది. తాజాగా ఈ సినిమా ప్రతిష్టాత్మక ’27వ బూసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌’లో ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం.

ఈనెల 14వ తేదీ వరకు జరగనున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ సినిమాని ఓపెన్ క్యాటగిరిలో స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నారు. ఇలా ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్క్రీనింగ్ ఎంపిక కావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా, భుసాన్ ఫిలిం ఫెస్టివల్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.

ఈ సందర్భంగా చిత్ర బృందం స్పందిస్తూ..ప్రతిష్టాత్మక బూసాన్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో మా సినిమా ప్రదర్శనకు ఎంపికవడం గర్వంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగామా ఈ సినిమా విజయం సాధించింది ఇప్పుడు మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఇకపోతే ఈ సినిమాకి కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించిన విషయం మనకు తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus