Hero Nani: నాని కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమా?

నాని, నజ్రియా హీరోహీరోయిన్లుగా నటించిన అంటే సుందరానికి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. నాని గత సినిమా శ్యామ్ సింగరాయ్ కు హిట్ టాక్ వచ్చినా భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం వల్ల ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కాస్ట్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఏపీ సర్కార్ టికెట్ రేట్లను భారీగా తగ్గించడం కూడా శ్యామ్ సింగరాయ్ సినిమాకు ఒకింత మైనస్ అయిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించింది.

అయితే అంటే సుందరానికి సినిమాకు బాక్సాఫీస్ వద్ద అనుకూల పరిస్థితులు లేవు. విక్రమ్, మేజర్, ఎఫ్3 సినిమాలు సక్సెస్ సాధించడంతో అంటే సుందరానికి సినిమాకు నాని ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకడం సులువు కాదు. అదే సమయంలో విక్రమ్ సినిమాను మించి పాజిటివ్ టాక్ వస్తే మాత్రమే అంటే సుందారనికి కలెక్షన్లు పుంజుకునే ఛాన్స్ ఉంటుంది. విక్రమ్ రూపంలో ఈ సినిమాకు గండం పొంచి ఉంది. మరోవైపు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఆశించిన స్థాయిలో లేవనే సంగతి తెలిసిందే.

మైత్రీ నిర్మాతలు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేస్తుండగా ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంటే సుందరానికి సినిమాకు టాక్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో నజ్రియాకు ఆఫర్లు కచ్చితంగా పెరుగుతాయని చెప్పవచ్చు. నాని గత సినిమాలు వీ, టక్ జగదీష్ కూడా ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచాయనే సంగతి తెలిసిందే.

అంటే సుందరానికి సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా ఫలితం ఏంటో మరో 36 గంటల్లో తేలిపోనుంది. నగరాల్లో, ప్రధాన పట్టణాల్లో ఈ సినిమా బుకింగ్స్ బాగానే ఉన్నా కొన్ని జిల్లాలలో మాత్రం ఈ సినిమాకు ఆశించిన విధంగా బుకింగ్స్ లేవు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బుకింగ్స్ పుంజుకునే అవకాశాలు అయితే ఉంటాయి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus