Devaraj: సలార్ సినిమా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన విలన్ దేవరాజ్!

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరసగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ శృతిహాసన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం సలార్. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్ బయటకు వచ్చిన పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది.

ఇక ఈ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ అంటూ మ్యూజిక్ డైరెక్టర్ నోరు జారారు. అయితే ఇది ఉగ్రం రీమేక్ కాదంటూ ప్రశాంత్ కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు.అలాగే ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుందంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఆయనప్పటికీ ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి క్లారిటీ లేదు.ఈ సినిమాలో విలన్ పాత్రలలో నటిస్తున్న నటుడు దేవరాజ్ ఈ సినిమా గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నటుడు దేవరాజ్ (Devaraj) తన సినిమాల గురించి పలు విషయాలను మాట్లాడారు. ఇక ప్రస్తుతం తాను ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమాలో నటిస్తున్నానని ఈయన వెల్లడించారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో తన పాత్ర గురించి మాట్లాడుతూ తన పాత్ర మొదటి పార్ట్ కన్నా రెండవ పార్ట్ చాలా హైలైట్ గా ఉండబోతుందని నోరు జారారు. ఈ విధంగా దేవరాజ్ రెండవ పాటలో నా పాత్ర హైలెట్ అవుతుందని చెప్పడంతో ఈ సినిమా రెండు భాగాలుగా తీస్తున్నారని అర్థమవుతుంది.

ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని డైరెక్టర్ సైతం సరైన సమయం చూసి ప్రకటిస్తానని గతంలో చెప్పారు. కానీ నటుడు దేవరాజ్ మాత్రం ఈ విషయంలో నోరు జారడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఈ సినిమాలో శృతిహాసన్ నటిస్తున్నారు.ఈమె మొదటిసారి ప్రభాస్ తో కలిసి ఈ సినిమాలో సందడి చేయబోతున్నారు.


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus