హీరోగా బలంగా కనిపించాలంటే, హీరోయిజం బాగా పండాలంటే… కావాల్సిన ముఖ్యమైన అంశమేంటి? ఏముంది సరైన మాస్ హీరో ఉండాలి.. క్యారక్టరైజేషన్ ఇంకా మాసీగా ఉండాలి, మాస్ మసాలా సీన్స్, యాక్షన్ సీన్స్ ఉండాలి అంటారా. వీటన్నింటితోపాటు హీరోతో పోటాపోటీగా కనిపించే విలన్ కావాలి. నువ్వు రెండు అంటే నేను రెండు అనేలా ఉండాలి. దెబ్బకి కింద పడిపోయే విలన్ కాకుండా, ఈ విలన్‌ను చితకొట్టాలి అనిపించేలా ఉండాలి. అప్పుడే విలనిజం బాగా పండుతుంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో అలాంటి విల్లను కనిపిస్తుంటారు. ఇప్పుడు ‘సలార్’కి కూడా అలాంటి ప్రతినాయకుడినే తీసుకొస్తున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇటీవల ‘సలార్’ మొదలైన విషయం తెలిసిందే. గోదావరి ఖని బొగ్గు గనుల్లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాలో విలన్ ఎవరనేది ఇంకా చిత్రబృందం ప్రకటించలేదు. ప్రశాంత్ నీల్ సినిమా కదా… బలమైన విలన్ ఉంటాడులే అనుకున్నారు. బాలీవుడ్ నుంచి ఎవరినైనా తీసుకొస్తారేమో అనుకుంటే… శాండిల్ వుడ్ నుంచే తీసుకొస్తున్నారు. శివరాజ్‌కుమార్ ‘వజ్రకాయ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న మధు గురుస్వామిని ‘సలార్’లో విలన్‌గా తీసుకున్నారట. ఈ విషయాన్ని మధు గురుస్వామినే సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
మధు గురుస్వామికి ఇది తొలి తెలుగు సినిమా కాదు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘సాక్ష్యం’లో మధు గురుస్వామి విలన్‌గా నటించాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు ఇప్పుడు తెలుగు సినిమాలో రీఎంట్రీ ఇస్తున్నాడు. అంటే ప్రభాస్‌తో తలపడబోయేది బెల్లంకొండ సాయిశ్రీనివాస్ విలన్ అన్నమాట. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ త్వరలోనే ముగియబోతోంది.
Most Recommended Video
జాంబీ రెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా
శృతీ ఈ సినిమాలను రిజెక్ట్ చేసి మంచి పనే చేసిందా..?