ఈమధ్యకాలంలో సినిమాకి లాభం ఎంత వచ్చింది అనే విషయం కంటే.. ఒక సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టారు అనేది పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఈ విషయంలో బోయపాటి తన భారీతనాన్ని ప్రదర్శించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్నట్లున్నాడు. అందుకే.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిస్తున్న “వినయ విధేయ రామ” చిత్రంలోని ఒక పాటను ఏకంగా 800 మంది డ్యాన్సర్స్ తో తెరకెక్కించనున్నాడట. ఈ పాట మొదట్లో వచ్చే రామ్ చరణ్ ఇంట్రడక్షన్ పాటా లేక చివర్లో వచ్చే బిల్డప్ సాంగా అనేది తెలియదు కానీ.. బోయపాటి ఏకంగా 800 మంది డ్యాన్సర్స్ తో ఈ పాట ప్లాన్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. అసలు ఇంతమంది డ్యాన్సర్స్ ఎందుకు సార్ అని కొందరు ప్రశ్నిస్తుంటే.. భారీతనం ఉట్టిపడుతోంది అని చరణ్ ఫ్యాన్స్ మాత్రం ఉప్పొంగిపోతున్నారు.
అయినా.. తెరపై కనిపించేదానికి మాత్రమే ఖర్చు చేయాలని మన నిర్మాతలు ఎప్పటినుంచో ఫాలో అవుతున్న పద్ధతిని ఈమధ్య భారీతనం పేరుతో పాడుచేస్తున్న విధానం ఇండస్ట్రీకి ఎంతమాత్రం మంచిది కాదు. మరి బోయపాటి భారీతనం వెండితెరపై ఎలా కనిపిస్తుందో తెలియాలంటే కొన్నాళ్లపాటు వెయిట్ చేయాల్సిందే. చరణ్ సరసన కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.