‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా..?

‘రంగస్థలం’ చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం మాస్ మాస్టర్ బోయపాటి దర్శకత్వం వహించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇది రాంచరణ్ కు 12 వ చిత్రం కావడం విశేషం. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డీ.వీ.వీ దానయ్య నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి పాటను తాజాగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ కు మంచి స్పందన లభించింది. ‘రామ్ కొణిదెల’ అనే డైలాగ్ తో సోషల్ మీడియా రచ్చ చేస్తుంది.

2019 సంక్రాంతి కానుకగా ఈ సినిమాని జనవరి 12న విడుదల చేయబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే డిసెంబర్ మూడో వారంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారట. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా ఎస్.ఎస్. రాజమౌళి హాజరుకాబోతున్నాడట. ‘వినయ విధేయ రామ’ చిత్రంతో పాటు.. రాజమౌళి డైరెక్షన్లో చరణ్ – ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ మల్టీ స్టారర్ ‘ఆర్.ఆర్ఆర్’ చిత్రాన్ని కూడా డీ.వీ.వీ దానయ్య నిర్మిస్తున్నారు రాజమౌళి ఈ వేడుకకు వస్తున్నారంటూ ఫిలింనగర్ లో చర్చించుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus