ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు వంటివి అమ్ముతూ రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోయింది మోనాలిసా. సోషల్ మీడియా బ్యాచ్ ఈమెను ఏ రేంజ్లో లేపారో అందరికీ తెలుసు.ఒక రకంగా ‘ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వస్తే తప్ప ఆమెను వైరల్ చేయడం మేము ఆపం’ అనే రేంజ్లో మోనాలిసాని వైరల్ చేశారు. ట్రెండ్ చేశారు. చివరికి నటిగా అవకాశం వచ్చేలా చేసి సక్సెస్ అయ్యారు. ఈమెకు సినిమాలో ఛాన్స్ ఇచ్చింది సనోజ్ మిశ్రా (Sanoj Mishra) అనే దర్శకుడు.
రాత్రికి రాత్రి ఫేమస్ అయిన మోనాలిసా క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలనే ప్రయత్నంలో భాగంగా.. సనోజే మిశ్రా (Sanoj Mishra) ఆమెకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సినిమాలో ఛాన్స్ వచ్చాక మోనాలిసా తీరు ఎలా మారిందో కూడా అందరూ చూశారు. ఆమెకు Z కేటగిరి సెక్యూరిటీ ఉన్నప్పటికీ.. కొందరి అభిమానులపై ఆమె మండిపడటం, దాడి చేయడం వంటి విజువల్స్ కూడా బాగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. మోనాలిసాకి సినిమాల్లో ఛాన్స్ ఇచ్చిన సనోజ్ మిశ్రా ఇప్పుడు అరెస్ట్ అవ్వడం అందరికీ షాకిచ్చింది.
సోమవారం నాడు ఆయన అరెస్టు అయ్యారని సమాచారం. ఇతనిపై అత్యాచారం కేసు నమోదైంది. దీంతో ఢిల్లీ పోలీసులు సనోజ్ ను అరెస్ట్ చేశారు.కొన్నాళ్ల క్రితం నుండి ఆయన ఓ వర్ధమాన నటిపై Laiగిక దాడి చేసినట్లు ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అందుకే ఆయనను అరెస్ట్ చేయడం జరిగినట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారట సనోజ్ మిశ్రా. కానీ కోర్టు అందుకు నిరాకరించినట్టు స్పష్టమవుతుంది.