దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. కరోనా కారణంగా అనేక సార్లు వాయిదా పడిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఎక్కువగా సురేష్ బాబు పేరే ప్రచారమైంది. జూన్ 17న విడుదల కాబోతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి పలు కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు.
1990 నేపథ్యంలో నక్సల్స్ కు పోలీసులకు మధ్య ఏర్పడిన పోరాటాల నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ చెప్పకనే చెప్పింది. అందులో భాగంగా వచ్చే బూతు డైలాగులను సెన్సార్ వారు కట్ చేసినట్టు తెలుస్తుంది.
— సినిమా ప్రారంభంలో ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే అన్నట్టు ఓ లైన్ వేశారట.
— టీజర్ లో సాయి పల్లవి పలికే ‘దొంగ ల*డి కొ**’ అనే పాదంలో ల*డి అనే పదాన్ని డిలీట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ పదం రెండు సార్లు వస్తుంది, కాబట్టి రెండు సార్లు మ్యూట్ చేసినట్లు తెలుస్తుంది.
— అలాగే ‘బాడ్ **’ అనే పదాన్ని కూడా మ్యూట్ చేశారు.
–అలాగే ‘రో*’ అనే పదాన్ని కూడా మ్యూట్ చేసినట్టు తెలుస్తుంది.
–అంతేకాకుండా ‘లం*’ అనే పదాన్ని కూడా మ్యూట్ చేసారని తెలుస్తుంది.
ఇదిలా ఉండగా.. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా ఉందని, క్లైమాక్స్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకునే దాని పై బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసేది డిపెండ్ అయ్యి ఉంటుందని సెన్సార్ వారు చెబుతున్నారు.