సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా ఈనెల 21వ తేదీ విడుదల ఎంతో అద్భుతమైన ఆదరణ సంపాదించుకుంది. ఈ సినిమా మొదటి రోజు నుంచి అద్భుతమైన టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను కూడా రాబడుతుంది. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ప్రమాదం తర్వాత కోలుకొని సాయి ధరంతేజ్ ఈ సినిమాలో నటించారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదం జరగకముందే ఈ సినిమా గురించి చర్చలన్ని జరిగి సినిమా పనులను మొదలుపెట్టారు.
అయితే ఆ సమయంలోనే హీరో ప్రమాదానికి గురయ్యారు.ఇలా సాయి ధరంతేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ సినిమా మరింత ఆలస్యమైందని తెలుస్తుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమా గురించి సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం గురించి పలు విషయాలను వెల్లడించారు. కరోనా పూర్తయిన తర్వాత మా సినిమా మొదలు పెట్టాలని బృందం మొత్తం సినిమా పనులలో బిజీగా ఉండి సినిమా గురించి చర్చించుకుంటున్నాము.
ఒక్కసారిగా కొన్ని సెకండ్ల వ్యవధిలో అందరి ఫోన్లు రింగ్ అయ్యాయి. ఆఫీస్ బాయ్ కూడా లోపలికి వచ్చి టీవీ పెట్టారు. అప్పుడే హీరో ప్రమాదానికి గురయ్యారని తెలిసింది.సాయి ధరమ్ తేజ్ 22 రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. నేను కూడా ఆ సమయంలో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నా కూడా ఆ 22 రోజులు కోమాలోనే ఉన్నానని కార్తీక్ తెలిపారు. ఇక ఈ ప్రమాదం నుంచి హీరో బయటపడ్డారని ఆయన లేచి తిరుగు గలుగుతారనే విషయం తెలిసినప్పుడే నేను ఊపిరి పీల్చుకున్నానని తెలిపారు.
ఇక సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) తిరిగి కోలుకొని సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత మొదటి మూడు రోజులు నటించడానికి కాస్త ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో తను స్పీచ్ తెరపి,డాన్స్ ప్రాక్టీస్ చేసి మళ్లీ సెట్ లోకి వచ్చి ఈ సినిమాని పూర్తి చేశారు అంటూ ఈ సందర్భంగా సాయిధరమ్ తేజ్ గురించి విరూపాక్ష సినిమా గురించి డైరెక్టర్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.