Virushka Daughter: విరుష్కపై విరుచుకుపడుతున్న నెటిజన్లు… పడరా మరి!

మేం బయటకు వచ్చినప్పుడు… మా కూతురు ఫొటోలు ఎవరూ తీయొద్దు అంటూ విరుష్క అలియాస్‌ విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ చెప్పారు గుర్తుందా. దీంతో ఇన్నాళ్లూ విరుష్క తనయ వామిక ఎలా ఉంటుందో ఎవరికీ తెలియకుండా పోయింది. ఒకటిరెండు ఫొటోలు బయటకు వచ్చినా… వాటిలో క్లారిటీ లేదు. అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో కేప్‌టౌన్‌లో జరిగిన వన్డే మ్యాచ్‌లో వామిక ఫస్ట్‌లుక్‌ బయటికొచ్చింది. ఆమె తల్లి ప్రముఖ కథానాయిక అయిన అనుష్క శర్మనే చూపించింది.

విరాట్‌ కోహ్లీ ఈ వన్డేలో అర్ధ శతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వామికను తీసుకొని, అనుష్క గ్యాలరీలోకి వచ్చింది. ‘అటు చూడు నాన్న హాఫ్‌ సెంచరీ కొట్టాడు’ అంటూ… కూతురికి చూపించింది. పిల్ల మహా చురుకు కదా… చప్పట్లు కొడుతూ సంబరపడిపోయింది. ఈలోపు విరాట్‌ కోహ్లీ క్రిస్‌ గేల్‌ స్టైల్‌లో అరచేతిలో చేతిలో బ్యాటు పెట్టుకొని ఓలలాడించేలా చేతులూపాడు. దీంతో ఆ మొత్తం వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

డీడీ స్పోర్ట్స్‌ కూడా ఆ వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ఇక్కడివరకు అంతా ఓకే. అయితే విరుష్క ఎందుకిలా చేశారనేదే చర్చ. ముందుగా చెప్పుకున్నట్లు మాకు ప్రైవసీ కావాలని, మా పాప ఫొటో తీయొద్దని చెప్పిన విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ ఇప్పుడు ఇలా స్టేడియంలో అన్ని కెమెరాల ముందుకు ఎందుకు వాళ్ల పాపను తీసుకొచ్చారు అనేదే ఆ చర్చల సారాంశం. ఒకరిద్దరు ఫొటోలు తీసే ప్రయత్నం చేయగానే నానా రచ్చ చేసిన మాజీ కెప్టెన్, ప్రజెంట్‌ హీరోయిన్‌…

ఇప్పుడు ప్రపంచానికి స్టేడియం వేదికగా తన బిడ్డను చూపించారు. మరి ముందు చెప్పిన ప్రైవసీ ఏమైంది అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరు అయితే అనుష్క – విరాట్‌ని సపోర్టు చేస్తున్నారు. ప్రైవసీకి భంగం కలిగించొద్దని ముందుగానే అడిగినా… ఆ మ్యాచ్‌ను టెలీకాస్ట్‌ చేసిన బ్రాడ్‌కాస్టర్‌ షూట్‌ చేయడం కరెక్ట్‌ కాదని అంటున్నారు. అలాగే అలా బయటికొచ్చిన ఫొటోలను షేర్‌ చేయడం సరికాదంటున్నారు. దీంతో ఈ విషయమై విరుష్కనే సమాధానం చెప్పాలి. వాళ్లు ఉ అంటే… అభిమానులు ఎలాంటి భయం లేకుండా మరిన్ని ఫొటోలు షేర్‌ చేస్తారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus