తారక్ కి సూపర్ ఛాలెంజ్ విసిరిన విశాల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సవాళ్లు కొత్తకాదు. ఛాలెంజ్ అన్నా.. వాటిని విసిరే వాలన్నా చాలా ఇష్టం. ఇప్పుడు విశాల్ ఎన్టీఆర్ కి  సూపర్ ఛాలెంజ్ విసిరారు. అదేంటంటే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో “అరవింద సమేత వీర రాఘవ” సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఒక హీరోయిన్ పూజా హెగ్డేతో ఉన్న కాంబినేషన్స్ సీన్స్ పూర్తి అయిపోయాయి.

క్లైమాక్స్ ఫైట్ కూడా పూర్తి అయింది. త్వరలోనే పొల్లాచ్చికి త్రివిక్రమ్ టీమ్ వెళ్లనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు ఈషా రెబ్బా కూడా పాల్గొనబోతోంది. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారు. ఆ సమయంలో మరో రెండో తెలుగు సినిమాలు కూడా రిలీజ్ కావడానికి ముస్తాబవుతున్నాయి. ఈ మధ్యలో తమిళ హీరో విశాల్ కూడా రానున్నట్లు సమాచారం. విశాల్ కు తెలుగులో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా విశాల్ చిత్రం అభిమన్యుడు డబ్బింగ్ చిత్రం అయినప్పటికీ భారీ కలక్షన్స్ సాధించి ఔరా అనిపించింది.

దీంతో విశాల్ నెక్స్ట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం విశాల్ అభిమన్యుడు తర్వాత పందెం కోడి2 సినిమాని చేస్తున్నారు. ఇది పందెం కోడి చిత్రానికి సీక్వెల్. పందెం కోడి తెలుగులో సూపర్ హిట్ అయింది. సో దానికి సీక్వెల్ అంటే సహజంగానే క్రేజ్ ఉంటుంది. అందుకే పందెం కోడి 2 మూవీ  “అరవింద సమేత వీర రాఘవ” సినిమాకి గట్టి పోటీ ఇస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. మరి పోటీలో విజయం ఎవరికీ వరిస్తుందో తెలుసుకోవాలంటే దసరా వరకు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus