విశాల్ హీరోయిన్ సాయి ధన్సికని వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గతంలో హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ని విశాల్ పెళ్లి చేసుకుంటాడని ప్రచారం జరిగింది. కానీ మనస్పర్థల కారణంగా బ్రేకప్ చెప్పేసుకున్నారు. అటు తర్వాత ఇతను నటి అనీషా రెడ్డితో విశాల్ ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యింది. తర్వాత అనీషా వేరే బిజినెస్మెన్ ను వివాహం చేసుకుంది. అటు తర్వాత అభినయతో విశాల్ ప్రేమలో ఉన్నట్టు ప్రచారం జరిగింది.
తర్వాత అది కూడా కేవలం ప్రచారం అని తేలిపోయింది. ఫైనల్ గా సాయి ధన్సిక ని వివాహం చేసుకోబోతున్నట్టు విశాల్ తెలిపాడు. ‘యోగిత’ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో విశాల్..తో ప్రేమ, పెళ్లి గురించి ఓపెన్ అయిపోయింది సాయి ధన్సిక. అది ఆ ఈవెంట్ కు వచ్చిన వారందరికీ సర్ప్రైజ్ ఇచ్చినట్టు అయ్యింది. ఆగస్టు 29నే వీరి పెళ్లి అంటూ వార్తలు కూడా వినిపించాయి. అయితే ఇటీవల ఓ వేడుకలో విశాల్.. ‘నడిగర్ సంఘం భవనం పూర్తయ్యాకే పెళ్లి చేసుకుంటాను అని గతంలో చెప్పాను.
ఆల్రెడీ నా పెళ్ళికి ఈ భవనాన్ని అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడం జరిగింది. నేను చెప్పినట్టు గానే భవనం పూర్తికావచ్చింది. ఆగస్టు 29న గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను’ అంటూ విశాల్ చెప్పడం జరిగింది. అంటే ఆగస్టు 29న విశాల్ – సాయి ధన్సిక..ల పెళ్లి జరగడం లేదు. కానీ అదే రోజున పెళ్లి డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.