Vishal: విశాల్ సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం.. వైరల్ అవుతున్న వీడియో!

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఇతను హీరోగా నటించిన ‘పందెం కోడి’ ‘పొగరు’ ‘భరణి’ ‘డిటెక్టివ్’ ‘అభిమన్యుడు’ వంటి సినిమాలు తెలుగులో కూడా సూపర్ సక్సెస్ సాధించాయి. అయితే తర్వాత విశాల్ నటించిన సినిమాలు ప్లాప్ అవ్వడంతో రేసులో వెనుక పడ్డాడు. ఇదిలా ఉండగా.. విశాల్ తాను నటించే ప్రతి సినిమాకి చాలా కష్టపడుతుంటాడు. స్టోరీ డిస్కషన్లతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాడు అని చాలా మంది చెబుతుంటారు.

అప్పుడప్పుడు రియల్ యాక్షన్ స్టంట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటాడు విశాల్. ఇందువల్ల అతను ప్రతి సినిమా షూటింగ్లో గాయపడుతుంటాడు.కొన్నిసార్లు సర్జరీలు కూడా జరిగాయి అయినా విశాల్ మారడు. అయితే ఇప్పుడు జరిగిన సంఘటన వేరు. ప్రస్తుతం అతను నటిస్తున్న ‘మార్క్ ఆంటోని’ చిత్రం షూటింగ్ సెట్లో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ వాహనం అదుపు తప్పి చిత్ర యూనిట్ పైకి దూసుకొచ్చింది.

టెక్నీకల్ ఇష్యు వల్ల ఇలాంటి ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతుంది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. తేడా వస్తే మాత్రం ప్రాణనష్టం జరిగేది అనడంలో సందేహం లేదు. ‘మార్క్ ఆంటోని’ సెట్‌లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను విశాల్ షేర్ చేస్తూ.. ‘కొన్ని క్షణాలు నిర్లక్ష్యంగా ఉంటే మా ప్రాణాలు పోయేవి అంటూ దేవుడికి థాంక్స్ చెబుతున్నట్టు కామెంట్ చేశాడు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus