సీన్ రివర్స్.. హీరో విలన్ గా, విలన్ హీరోగా..!

లాక్ డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయి.. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఎందరినో ఆదుకొని అండగా నిలిచాడు నటుడు సోనూసూద్. వలస కూలీలను సొంత ఇళ్లకు చేర్చడం నుండి.. సోషల్ మీడియాలో సాయం కోరిన వారి వరకు ప్రతి ఒక్కరికీ తన సహాయం అందించాడు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా పేరు తెచ్చుకున్నాడు సోనూ. దీంతో దర్శకనిర్మాతలు సోనూని హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో సోనూ హీరోగా నటిస్తోన్న సినిమాలు కూడా మొదలయ్యాయి.

ఇప్పటికే ‘కిసాన్’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించాడు. అలానే టాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘క్రాక్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తాడని వార్తలు వస్తున్నాయి. రవితేజ పోషించిన పాత్ర బాలీవుడ్ లో సోనూసూద్ చేయనున్నాడు. అలానే ఇప్పుడు మరో సౌత్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో విశాల్ హీరోగా దర్శకుడు పి.ఎస్.మిత్రన్ ‘ఇరుంబు తిరై’ అనే సినిమాను రూపొందించాడు. దీన్ని తెలుగులో ‘అభిమన్యుడు’ పేరుతో రిలీజ్ చేశారు.

రెండు భాషల్లో ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు సోనూసూద్. రీమేక్ రైట్స్ ని కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ విశేషమేంటంటే.. తమిళంలో విశాల్ పోషించిన హీరో పాత్రలో సోనూసూద్ నటించనుండగా.. విలన్ అర్జున్ పాత్రలో విశాల్ నటించనున్నాడని తెలుస్తోంది. అదే గనుక నిజమైతే.. వెండితెరపై సోనూసూద్ హీరోగా, విశాల్ ను విలన్ గా చూసే ఛాన్స్ వస్తుంది. ఈ రేర్ కాంబినేషన్ సెట్ అయితే గనుక అంచనాలు పెరిగిపోవడం ఖాయం.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus