Bigg Boss 5 Telugu: ఎలిమినేట్ అవుతూ టాప్ – 10 ర్యాంక్స్ ఇచ్చిన విశ్వ..!

బిగ్ బాస్ హౌస్ లో 9వ వారం అనూహ్యాంగా విశ్వ ఇంటినుంచీ బయటకి వచ్చేశాడు. చాలామంది స్ట్రాంగ్ ప్లేయర్ అని భావించినా కూడా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ పెద్దగా లేకపోవడంతో ఓట్లు పడలేదు. హౌస్ లో మాత్రం హీరోగా ఉన్న విశ్వ ఓటింగ్ లో మాత్రం వెనకబడ్డాడు. దీంతో ఎలిమినేట్ అవ్వకతప్పలేదు. ఇక స్టేజ్ పైన తన జెర్నీని చూసి సంబరపడిపోయిన విశ్వ. హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ వాళ్ల గేమ్ గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. అంతేకాదు, తన దృష్టిలో టాప్ 10 ర్యాంకింగ్స్ కూడా ఇచ్చాడు. ఫస్ట్ హౌస్ లోకి వెళ్లగానే నా మనసుకి కనెక్ట్ అయిన వ్యక్తి ప్రియాంక. సిస్టర్ గా తను నాకు బాగా కనెక్ట్ అయ్యింది.

అయినా కూడా ఎక్కడో గేమ్ దెబ్బకొట్టింది అంటూ 10వ ర్యాంక్ ఇచ్చాడు. కాజల్ ధైర్యంగా లేదని 9వ ర్యాంక్ ఇచ్చాడు. ఇక గేమ్ లో గివ్ అప్ ఇవ్వకు బ్రదర్ అంటూ జెస్సీకి 8వ ర్యాంక్ ఇచ్చాడు. ఆ తర్వాత 7వ ర్యాంక్ ని అనీమాస్టర్ కి ఇస్తూ, అక్కా నువ్వు మంచి పైటర్ వి అని మెచ్చుకున్నాడు. గెలవడం, ఓడటం అనేది చాలా సహజం అని, ఓడిపోయినపుడు బాధపడద్దని సలహా ఇస్తూ మానస్ కి 6వ ర్యాంక్ ఇచ్చాడు. తన దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చెప్పాడు విశ్వ. టాప్ 5లో సిరిని చూడాలని ఉందని ఆల్ ద బెస్ట్ చెప్తూ 5వ ర్యాంక్ ఇచ్చాడు. అలాగే, కూల్ గా కాకుండా ఎగ్రెసివ్ గా నీలాగానే గేమ్ ఆడు సన్నీ అంటూ సన్నీకి 4వ స్థానం కల్పించాడు.

గెలిస్తే చిల్ అవుతావ్, ఓడిపోతే కింద కుంపటి పెట్టినట్లుగా ఉంటావ్ అంటూ అలాగ ఫీల్ అవ్వకు అని సలహా ఇస్తూ షణ్ముక్ కి మూడో ప్లేస్ ఇచ్చాడు. ఇక తన ప్రెండ్ రవిని అందరూ గుంటనక్క అని అనుకుంటారు కానీ, అలా ఉండడని చాలా మంచి హృదయం ఉందని చెప్పాడు. అంతేకాదు, తన బ్రదర్ రవి అని ఎప్పటికీ నిన్ను బ్రో అని పిలుస్తానని చెప్తూ 2వ స్థానం ఇచ్చాడు. ఇక మొదటి ప్లేస్ లో శ్రీరామ్ చంద్ర ఉన్నాడని, శ్రీరామ్ గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. రీసంట్ గా నా తమ్ముడిని నేను కోల్పోయాను అని, కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఇంకో బ్రదర్ ని ఇచ్చిందని చెప్పాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సీజన్ కి విన్నర్ గా శ్రీరామ్ చంద్రని చెప్తూ 1వ స్థానం ఇచ్చాడు విశ్వ. అదీ మేటర్.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus