Bigg Boss 5 Telugu: దమ్ముంటే ఆడి గెలవండి – రెచ్చిపోయిన విశ్వ

బిగ్ బాస్ హౌస్ లో రాజ్యానికి ఒక్కడే రాజు అనే టాస్క్ చాలా రసవత్తరంగా మారింది. రవి రాజకుమారుడు సైడ్ కొంతమంది హౌస్ మేట్స్, అలాగే సన్నీ రాజకుమారుడు సైడ్ కొంతమంది హౌస్ మేట్స్ వచ్చారు. ఇక్కడ్నుంచీ టాస్క్ లు ఇవ్వడం స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా బురదలో కుస్తీ మూడు రౌండ్స్ ఆడాలని నియమం పెట్టాడు. శ్రీరామ్ చంద్ర రవి బ్రైన్ ని మార్చాడు. తన టీమ్ నుంచి ఇద్దరు ఫిమేల్ కంటెస్టెంట్స్ పోటీచేసేలా గేమ్ ప్లాన్ వేశాడు.

ఎందుకంటే, సన్నీ దగ్గర కేవలం పింకీ మాత్రమే ఫిమేల్ పార్టిసిపెంట్ ఉంది. అప్పుడు మేల్ అండ్ ఫిమేల్ కుస్తీ పట్టాల్సి వస్తుందని సంచాలక్ గా నేను దీన్ని రిజక్ట్ చేస్తానని చెప్పాడు శ్రీరామ్ చంద్ర. అనుకున్నట్లుగానే గేమ్ ప్లాన్ వేశాడు రవి. కానీ, సన్నీ దీన్ని తెలివిగా తిప్పుకొట్టాడు. మా దగ్గర ఫిమేల్ కంటెస్టెంట్స్ లేరని, కుస్తీలో మేము మేల్ పార్టిసిపెంట్స్ నే దింపుతామని చెప్పాడు. దీంతో ఫైనల్ గా కెమెరా ముందుకు వచ్చి రవి తమ టీమ్ లో నుంచీ విశ్వ, అనిమాస్టర్, ఇంకా శ్వేతలు బరిలోకి దిగుతున్నారని ఎనౌన్స్ చేశాడు.

అలాగే, సన్నీ కూడా మానస్, పింకీ, జెస్సీల పేర్లు చెప్పాడు. ఫస్ట్ విశ్వతో పాటు మానస్ బరిలోకి దిగాడు. ఇక్కడే విశ్వ తన విశ్వరూపాన్ని చూపించాడు. బరిలో దిగిన మానస్ ని ఓడించినట్లుగా సమాచారం. కేవలం బురదలోనే కాకుండా బయట కూడా ఇద్దరూ వాగ్వివాదానికి దిగినట్లుగా చూపించారు. ప్రోమోలో చూస్తే దమ్ముంటే అలా ఆడి గెలవాలి అంటూ విశ్వ తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీనికి మానస్ బాగా రియాక్ట్ అయ్యాడు. ఎవరి గురించి చెప్తున్నావో పేర్లు చెప్పి మాట్లాడు అంటూ ఆర్గ్యూమెంట్ చేశాడు. మరి ఈ టాస్క్ పరియవసానం ఎక్కడివరకూ దారి తీస్తుందో చూడాలి.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus