Vishwak Sen: విమర్శలు వస్తే ఏంటి..? అవకాశాలు మాత్రం బోలెడు!

‘వెళ్లిపోమాకే’ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఆ తరువాత ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో యూత్ ని ఆకట్టుకున్నారు. ఈ సినిమా రిలీజైన కొన్నాళ్లకే సొంతంగా ‘ఫలక్ నుమా దాస్’ అనే సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు హీరోగా కూడా నటించారు. ఈ సినిమా ప్రోమోలు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. పైగా సినిమా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. దీంతో సినిమాకి హైప్ వచ్చింది.

Click Here To Watch NOW

ఈ సినిమా అంచనాలకు తగ్గట్లుగా లేకపోయినా.. మంచి కలెక్షన్స్ ను సాధించింది. ఇక ‘హిట్’ సినిమా అయితే విశ్వక్ సేన్ కి భారీ విజయాన్ని తీసుకొచ్చింది. ఇదిలా ఉండగా.. విశ్వక్ సేన్ స్టేజ్ లపై మాట్లాడేప్పుడు అతి చేస్తుంటాడని.. పబ్లిసిటీ కోసం ఎక్కువ మాట్లాడుతుంటాడని సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయి. విజయ్ దేవరకొండను అనుకరించే ప్రయత్నంలో హద్దులు దాటిపోతుంటాడని కూడా కామెంట్స్ పడుతుంటాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా.. తన స్టైల్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు విశ్వక్ సేన్.

Vishwak Sen bags big producer movie1

ఇతడిపై ఎంత నెగెటివిటీ ఉన్నా.. సక్సెస్ రేట్ మరీ గొప్పగా లేనప్పటికీ.. విశ్వక్ సేన్ కి అవకాశాలు అయితే వస్తూనే ఉన్నాయి. తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా ‘ముఖచిత్రం’ అనే టీజర్ వచ్చింది. దీంతోపాటు అతడు నటిస్తోన్న ‘అశోక‌వ‌నంలో అర్జున క‌ళ్యాణం’, ‘ఓరి దేవుడా’ సినిమాల పోస్టర్స్ ని కూడా రిలీజ్ చేశారు. వీటితో పాటు ‘గామి’ అనే సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

ఇవి కాకుండా ‘దమ్కీ’ అనే సినిమాను మొదలుపెట్టాడు. ‘ఫలక్ నుమా దాస్ 2’, ‘స్టూడెంట్’ అనే కొత్త సినిమాల్లో కూడా నటించబోతున్నట్లు ఇటీవల విశ్వక్ సేన్ వెల్లడించాడు. బహుశా యంగ్ హీరోల్లో ఇంత బిజీగా ఉన్న మరో హీరో లేరేమో..!

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus